Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ షూటింగ్ పూర్తి.. విదేశాల నుంచి స్పెషల్ వీడియో షేర్ చేసిన విజయ్..

ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ షూటింగ్ అయిపోయింది అంటూ రిలీజ్ చేసిన చిన్న వీడియో వైరల్ గా మారింది.

Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ షూటింగ్ పూర్తి.. విదేశాల నుంచి స్పెషల్ వీడియో షేర్ చేసిన విజయ్..

Vijay Deverakonda Mrunal Thakur Family Star Movie Shoot Completed

Family Star : లైగర్ సినిమా భారీ పరాజయం తర్వాత విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఫ్యామిలీ స్టార్ అంటూ రాబోతున్నాడు. గతంలో తనకి ‘గీతగోవిందం’ లాంటి 100 కోట్ల హిట్ సినిమా ఇచ్చిన పరుశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసి మంచి అంచనాలు నెలకొల్పారు.

ఫ్యామిలీ స్టార్ సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు కనెక్ట్ అవుతూనే విజయ్ డ్యాన్స్ కి కావాల్సిన మాస్ అంశాలు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, డైరెక్టర్ పరుశురామ్ షూటింగ్ పూర్తయిన సందర్భంగా కౌగలించుకొని ఆనందం వ్యక్తం చేస్తూ మా షూట్ కంప్లీట్ అయిందని విదేశాల్లో షూటింగ్ లొకేషన్ నుంచి ఓ వీడియోని రిలీజ్ చేశారు.

Also Read : Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా అప్డేట్ ఇస్తామంటున్న నిర్మాతలు.. సినిమా ఇంకా ఉందా అంటున్న ఫ్యాన్స్..

ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ షూటింగ్ అయిపోయింది అంటూ రిలీజ్ చేసిన చిన్న వీడియో వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న థియేటర్స్ లోకి రానుంది. విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నారు.