పాక్‌ పరువు పాయే..! పీఎస్ఎల్ ఫైనల్ మ్యాచ్‌కూ ఆదరణ కరువు

పీఎస్ఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో ఇస్లామాబాద్ యునైటెడ్ వర్సెస్ ముల్తాన్ సుల్తాన్ జట్ల మధ్య జరిగింది

పాక్‌ పరువు పాయే..! పీఎస్ఎల్ ఫైనల్ మ్యాచ్‌కూ ఆదరణ కరువు

PSL 2024

PSL 2024 Final Match : పాకిస్థాన్ సూపర్ లీగ్ 2024 (పీఎస్ఎల్) అట్టర్ ప్లాప్ అయింది. టోర్నీ ప్రారంభం నుంచి నిర్వహించిన ఏ మ్యాచ్ కూ స్టేడియంలో నిండుగా ప్రేక్షకులు హాజరుకాలేదు. ఏ గ్రౌండ్ అయినా.. ప్రతీమ్యాచ్ లోనూ స్టాండ్ లలో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. దీంతో టోర్నీలో మ్యాచ్ లు ప్రేక్షకుల సందడి లేకుండానే ఫైనల్ మ్యాచ్ వరకు సైలెంట్ గా సాగాయి. ఖాళీ స్టాండ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, ఫైనల్ మ్యాచ్ లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.

Also Read : హమ్మయ్య బతికిపోయాం..! క్రికెట్ మ్యాచ్‌ జరుగుతుండగా మైదానంలోకి దూసుకొచ్చిన తేనెటీగల గుంపు.. వీడియో వైరల్

పీఎస్ఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో ఇస్లామాబాద్ యునైటెడ్ వర్సెస్ ముల్తాన్ సుల్తాన్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బాల్ కు ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు విజయం సాధించింది. ఎలాంటి టోర్నీలోనైనా ఫైనల్ మ్యాచ్ అంటే స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. చూద్దామన్నా ఖాళీ కుర్చీ కనిపించవు. కానీ, పీఎస్ఎల్ ఫైనల్ మ్యాచ్ కు సైతం ప్రేక్షకుల ఆదరణ లభించలేదు. స్టేడియంలో ఖాళీ స్టాండ్లు కనిపించాయి. ఈ విషయాన్ని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ అక్రమ్ కూడా ఒప్పుకున్నాడు. ఓ స్పోర్ట్స్ ఛానెల్ లో ఆయన మాట్లాడుతూ.. కరాచీలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లోనూ స్టేడియంలో ఖాళీ స్టాండ్లు కనిపించినట్లు చెప్పాడు. దీంతో  నెటిజన్లు సోషల్ మీడియాలో స్టేడియం స్టాండ్లలో ఖాళీకుర్చీల ఫొటోలను షేర్ చేస్తూ పాకిస్థాన్ ను ట్రోల్స్ చేస్తున్నారు.

Also Read : దయచేసి నన్ను అలా పిలవకండి.. ఇబ్బందిగా ఉంది: విరాట్ కోహ్లి

భారత్ లో జరిగే ఐపీఎల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్ లో ఎలాంటి మ్యాచ్ అయినా స్టేడియంలోని స్టాండ్లు మొత్తం క్రికెట్ అభిమానులతో నిండుగా కనిపిస్తుంటాయి. అదే తరహాలో డబ్ల్యూపీఎల్ (మహిళల ప్రీమియర్ లీగ్) 2024 టోర్నీకి కూడా మంచి ఆదరణ లభించింది. ఈ మ్యాచ్ లను వీక్షించేందుకు స్టేడియంకు భారీ సంఖ్యలో క్రీడాభిమానులు తరలివచ్చారు. డబ్ల్యూపీఎల్ మ్యాచ్ లకు వచ్చినంత స్థాయిలోకూడా పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్ లకు ప్రేక్షకులు హాజరుకాకపోవటం గమనార్హం. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు డబ్ల్యూపీఎల్, పీఎస్ఎల్ మ్యాచ్ లను పోల్చుతూ పాకిస్థాన్ పై సెటైర్లు వేస్తున్నారు.