వైజాగ్ డ్రగ్స్ కేసులో విచారణ జరుగుతోంది.. వారు అందరూ టీడీపీ బంధువులే: పేర్ని నాని

Perni Nani: ఎన్నికల వేళ ఓటు కోసం చంద్రబాబు నాయుడు ఏదైనా చేస్తారని చెప్పారు.

వైజాగ్ డ్రగ్స్ కేసులో విచారణ జరుగుతోంది.. వారు అందరూ టీడీపీ బంధువులే: పేర్ని నాని

Perni Nani

Perni Nani: విశాఖ సీపోర్టులో 25,000 కిలోల డ్రగ్స్‌ పట్టుబడడంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. అమరావతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్టు నుంచి విశాఖ తీరానికి వచ్చిన ఓ కంటైనర్‌లో ఆ డ్రగ్స్‌ను సీబీఐ గుర్తించిందని చెప్పారు. ఆ డ్రగ్స్ కంటైనర్ విశాఖకు చేరుకోవడంతో దేశం మొత్తం ఉలిక్కి పడిందని తెలిపారు.

ఆ డ్రగ్స్ బయటకు రాకుండా సీబీఐ పట్టుకోవడం అదృష్టమని చెప్పారు. ఆ డ్రగ్స్ కు సంబంధించి లావాదేవీలు జరిపిన సంస్థలు, వ్యక్తులు ఎవరనే అంశంపై విచారణ జరుగుతోందని తెలిపారు. ఈ విషయంపై సీబీఐ అధికారులు మాట్లాడకముందే వైసీపీపై చంద్రబాబు, టీడీపీ విషం చిమ్ముతున్నారని చెప్పారు.

విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న వారు అందరూ టీడీపీ బంధువులేనని అన్నారు. బ్రాందీ పంచే స్థాయిని దాటి డ్రగ్స్ పంచే స్థాయికి చంద్రబాబు, లోకేశ్ దిగజారారా అనే అనుమానం కలుగుతోందని చెప్పారు. చంద్రబాబు స్నేహమంతా దొంగలతోనేనని అన్నారు. రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు ఎంతకైనా దిగజారతారని చెప్పారు.

డ్రగ్స్ రవాణాపై సమగ్ర విచారణ చేపట్టాలని అన్నారు. ఓటు కోసం చంద్రబాబు నాయుడు ఏదైనా చేస్తారని చెప్పారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి డ్రగ్స్ రవాణాపై చంద్రబాబు ట్వీట్ చేశారని అన్నారు. ఆధారాల్లేని ఆరోపణలు చేస్తే ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్లేనని తెలిపారు.

Also Read: రాజమండ్రి రూరల్‌లో టీడీపీ హాట్రిక్కా.. వైసీపీ సంచలనమా?