IPL 2024 : పాపం కావ్య పాప..! నాలుగు బంతుల్లో మారిపోయిన రియాక్షన్.. వీడియో వైరల్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మ్యాచ్ అంటేనే జట్టు అభిమానులకు, క్రికెట్ ప్రియులకు ముందుగా కావ్య మారన్ గుర్తుకొస్తారు.

IPL 2024 : పాపం కావ్య పాప..! నాలుగు బంతుల్లో మారిపోయిన రియాక్షన్.. వీడియో వైరల్

Kavya Maran

Kavya Maran : ఐపీఎల్ 2024 టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది. శనివారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బాల్ వరకు నువ్వానేనా అన్నట్లుగా ఇరుజట్లు తలపడ్డాయి. మైదానంలోని ప్రేక్షకులు, టీవీ ముందు వీక్షకులు చివరి ఓవర్ వరకు ఊపిరి బిగబట్టుకొని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి కేకేఆర్ జట్టు విజయాన్ని అందుకుంది. పేసర్ హర్షిత్ రాణా సూపర్ బౌలింగ్ తో నాలుగు పరుగుల తేడాతో కేకేఆర్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ హావభావాలు మళ్లీ ప్రేక్షకులను కట్టిపడేశాయి.

Also Read : KKR vs SRH : బోణీ కొట్టిన కోల్‌కతా.. తొలి మ్యాచ్‌లో పోరాడి ఓడిన హైదరాబాద్..!

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మ్యాచ్ అంటేనే జట్టు అభిమానులకు, క్రికెట్ ప్రియులకు ముందుగా కావ్య మారన్ గుర్తుకొస్తారు. ఎస్ఆర్ హెచ్ ఆడే ప్రతీ ఐపీఎల్ మ్యాచ్ లోనూ ఆమె చేసే సందడి అంతాఇంతాకాదు. జట్టు ఓటమి సమయంలోనూ, గెలిచే సమయంలోనూ ఆమె హావభావాలు ప్రతీఒక్కరిని ఆకట్టుకుంటాయి. గతేడాది ఐపీఎల్ టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అంటే కెమెరాలన్నీ కావ్యమారన్ వైపు వెళ్లిన పరిస్థితి. తాజాగా ఐపీఎల్ టోర్నీలోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన తొలి మ్యాచ్ లో కావ్య మారన్ సందడి చేశారు. మ్యాచ్ చివరి కొద్ది నిమిషాల్లో ఆమె హావభావాలు క్షణక్షణానికి మారిపోయాయి.

Also Read : ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయ దుందుభి

ఆండ్రి రసెల్ (64 నాటౌట్ 25బంతుల్లో) విధ్వంసంతో కేకేఆర్ జట్టు నిర్ణీత ఓవర్లలో 208 పరుగులు చేసింది. 209 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఎస్ఆర్‌హెచ్‌ జట్టు.. ప్రారంభంలో రాణించినా.. తరువాత అనుకున్న స్థాయిలో పరుగులు రాబట్టలేక పోయింది. దీంతో ఆ జట్టు ఓటమి ఖాయమనుకుంటున్న సమయంలో హెన్రిచ్ క్లాసెన్ (63 పరుగులు 29 బంతుల్లో) విధ్వంసం సృష్టించాడు. జట్టు విజయం ఆశలు రావటంతో కావ్య మారన్ సందడి చేశారు. 19వ ఓవర్ మిచెల్ స్టార్క్ వేయగా.. హెన్రిచ్ క్లాసెన్ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. చివరి ఓవర్ లో 13 పరుగులు చేయాల్సి ఉంది. హర్షిత్ బౌలింగ్ లో తొలి బంతికే క్లాసెన్ సిక్స్ కొట్టడంతో కేకేఆర్ జట్టు ఓటమి ఖాయమైందని అందరూ భావించారు. కానీ, మిగిలిన ఐదు బంతుల్లో హర్షిత్ అద్భుతమైన బౌలింగ్ తో రెండు వికెట్లు పొడగొట్టాడు. చివరి బాల్ కు ఐదు పరుగులు చేయాల్సి ఉంది.. కెప్టెన్ కమిన్స్ షాట్ కొట్టే ప్రయత్నంలో విఫలం కావడంతో ఎస్ఆర్‌హెచ్‌ జట్టు ఓటమి పాలైంది. ఎస్ఆర్‌హెచ్‌ ఓనర్ కావ్య మారన్ 19.1 ఓవర్ లో ఆనందం నుంచి 19.5 ఓవర్ కి నిరాశకు గురైంది. నాలుగు బంతుల్లోనే ఆమె ఆశలన్నీ ఆవిరయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.