BAN vs SL : కామెడీ ఎర్ర‌ర్స్‌.. ఒక్క క్యాచ్.. ముగ్గురు స్లిప్ ఫిల్డ‌ర్లు.. న‌వ్వులే న‌వ్వులు

ముగ్గురు ఫీల్డ‌ర్లు క్యాచ్‌ను మిస్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు నవ్వు ఆపుకోలేక‌పోతున్నారు.

BAN vs SL : కామెడీ ఎర్ర‌ర్స్‌.. ఒక్క క్యాచ్.. ముగ్గురు స్లిప్ ఫిల్డ‌ర్లు.. న‌వ్వులే న‌వ్వులు

Three Bangladesh slip fielders drop a catch video viral

BAN vs SL 2nd Test : శ్రీలంక జ‌ట్టు ప్ర‌స్తుతం బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న‌లో ఉంది. చటోగ్రామ్ వేదిక‌గా శ్రీలంక‌, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో జ‌రిగిన ఓ ఘ‌ట‌నకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ముగ్గురు ఫీల్డ‌ర్లు క్యాచ్‌ను మిస్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు నవ్వు ఆపుకోలేక‌పోతున్నారు. శ్రీలంక మొద‌టి ఇన్నింగ్స్ సంద‌ర్భంగా ఇది చోటు చేసుకుంది.

శ్రీలంక ఇన్నింగ్స్ 121వ ఓవ‌ర్‌ను బంగ్లాదేశ్ బౌల‌ర్ ఖ‌లేద్ అహ్మ‌ద్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఆఖ‌రి బంతిని లంక ఆట‌గాడు ప్ర‌భాత్ జ‌య‌సూర్య క‌వ‌ర్స్ వైపుగా షాట్ ఆడాడు. అయితే.. ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్ వైపుగా వెళ్లింది. తొలి స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ న‌జ్ముల్ షాంటో బంతిని అందుకోవ‌డంలో త‌డ‌బ‌డ్డాడు. ఈ క్ర‌మంలో రెండో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న షాహ‌దాత్ బాల్‌ను అందుకునేందుకు ప్ర‌య‌త్నించాడు.

Rishabh Pant : గెలుపు జోష్‌లో ఉన్న పంత్‌కు భారీ షాక్‌.. మ‌రోసారి ఇలాగే జ‌రిగితే..!

అత‌డు కూడా విఫ‌లం కావ‌డం, బంతి కాస్త మూడో స్లిప్ వైపుకు వెళ్ల‌డంతో అక్క‌డ ఫీల్డింగ్ చేస్తున్న జ‌కీర్ హ‌స‌న్ డైవ్ చేసి బంతిని అందుకునేందుకు ప్ర‌య‌త్నించి విఫ‌లం అయ్యాడు. ఇలా ముగ్గురు చేతుల్లో ప‌డిన బంతి చేజారిపోయింది. దీంతో క్యాచ్ మిస్ అయింది. ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా.. ముగ్గురు ఆట‌గాళ్లు కూడా బంతిని అందుకోలేక‌పోవ‌డం పై నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. కుశాల్ మెండిస్ (93), కమిందు మెండిస్ (92), కరుణరత్నె (86), ధనంజయ డిసిల్వా (70), చండిమాల్ (59), నిషాన్ మదుష్క (57)లు అర్ధ‌శ‌త‌కాలు చేయ‌డంతో తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 531 ప‌రుగులు చేసింది. మూడో రోజు లంచ్ విరామానికి బంగ్లాదేశ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు న‌ష్ట‌పోయి 115 ప‌రుగులు చేసింది. షకీబ్ అల్ హసన్ (6), మోమినుల్ హక్ (2) లు క్రీజులో ఉన్నారు. లంక తొలి ఇన్నింగ్స్ స్కోరుకు లంక ఇంకా 416 ప‌రుగుల వెనుకంజ‌లో ఉంది. కాగా.. తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో శ్రీలంక విజ‌యం సాధించింది.

ఒక్క సిరీస్‌కే అల్లుడి కెప్టెన్సీ పోయింది.. మామ‌ రియాక్ష‌న్ వైర‌ల్‌