Virat Kohli : విరాట్ కోహ్లి ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్‌లో అత్య‌ధిక మ్యాచ్‌లు ఓడిన ఆట‌గాడిగా..!

కింగ్ కోహ్లి మైదానంలో దిగితే రికార్డులు బ‌ద్ద‌లు అవ్వాల్సిందే.

Virat Kohli : విరాట్ కోహ్లి ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్‌లో అత్య‌ధిక మ్యాచ్‌లు ఓడిన ఆట‌గాడిగా..!

Most IPL matches lost Virat Kohli top in unwanted list

Kohli : కింగ్ కోహ్లి మైదానంలో దిగితే రికార్డులు బ‌ద్ద‌లు అవ్వాల్సిందే. ఛేజింగ్‌లో అత్య‌ధిక‌ ప‌రుగులు, శ‌త‌కాలు ఇలా ఎన్నో రికార్డుల‌ను అత‌డు బ‌ద్ద‌లు కొట్టాడు. అయితే.. అత‌డి ఖాతాలో ఓ చెత్త రికార్డు వ‌చ్చి చేరింది. ఏ ఆట‌గాడు కూడా కోరుకుని రికార్డు అది. ఐపీఎల్‌లో అత్య‌ధిక మ్యాచుల్లో ఓడిన ఆడిగాడిగా నిలిచాడు. మంగ‌ళ‌వారం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ చేతిలో 28 ప‌రుగుల తేడాతో ఓడిపోవ‌డంతో విరాట్ ఈ చెత్త రికార్డు జాబితాలో అగ్ర‌స్థానంలో మ‌రింత ముందుకు వెళ్లాడు.

విరాట్ కోహ్లి ఇప్ప‌టి వ‌ర‌కు 120 మ్యాచుల‌ ఓట‌ముల్లో భాగ‌స్వామ్యం అయ్యాడు. అత‌డి త‌రువాత దినేశ్‌కార్తీక్ 118 ఓట‌ముల్లో భాగ‌స్వామ్యంతో రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. వీరిద్ద‌రి త‌రువాత ముంబై ఇండియ‌న్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (112 మ్యాచులు) మూడో స్థానంలో ఉన్నాడు.

2008 ఐపీఎల్ ఆరంభం నుంచి విరాట్ కోహ్లి ఆడుతున్నాడు. 17 సంవ‌త్స‌రాలు ఒకే జ‌ట్టుకు ఆడుతున్న ఏకైక ఆట‌గాడు విరాట్ కోహ్లి కావ‌డం గ‌మ‌నార్హం. తాను ఐపీఎల్ ఆడేంత కాలం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌రుపున మాత్ర‌మే ఆడ‌తాన‌ని ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో కోహ్లి చెప్పాడు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు కోహ్లీకి, ఆర్‌సీబీకీ ఐపీఎల్ ట్రోఫీ అంద‌ని ద్రాక్ష‌గానే మిగిలింది.

RCB vs LSG : బెంగ‌ళూరు కొంప‌ముంచిన వికెట్ కీప‌ర్ అనూజ్‌రావ‌త్‌.. ఆ క్యాచ్ ప‌ట్టుంటే..!

ఐపీఎల్‌లో అత్య‌ధిక మ్యాచుల ఓట‌ముల్లో భాగ‌స్వామ్యం అయిన ఆట‌గాళ్లు వీరే..

విరాట్ కోహ్లి (ఆర్‌సీబీ) – 120 *మ్యాచులు
దినేశ్ కార్తీక్ (ఆర్‌సీబీ) – 118 *మ్యాచులు
రోహిత్ శ‌ర్మ (ముంబై ఇండియ‌న్స్‌) – 112* మ్యాచులు
శిఖ‌ర్ ధావ‌న్ (పంజాబ్ కింగ్స్‌) – 107* మ్యాచులు
రాబిన్ ఉత‌ప్ప – 106 మ్యాచులు

చిన్న‌స్వామి వేదిక‌గా మంగ‌ళ‌వారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచులో ఆర్‌సీబీ 28 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు న‌ష్ట‌పోయి 181 ప‌రుగులు చేసింది. డికాక్ (81) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా పూర‌న్ (40) విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాడు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో ఆర్‌సీబీ 19.4 ఓవ‌ర్ల‌లో 153 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఇంపాక్ట్ ప్లేయ‌ర్ లోమ్రోర్ (33) ఒక్క‌డే రాణించాడు.

Ben Stokes : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి త‌ప్పుకున్న బెన్‌స్టోక్స్‌