RR vs RCB Match Prediction : ఆర్‌సీబీ వ‌ర్సెస్ ఆర్ఆర్ మ్యాచులో ఎవరు గెలుస్తారు? హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే..

శ‌నివారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

RR vs RCB Match Prediction : ఆర్‌సీబీ వ‌ర్సెస్ ఆర్ఆర్ మ్యాచులో ఎవరు గెలుస్తారు? హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే..

IPL 2024 Match 19 RR vs RCB

RR vs RCB : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో భాగంగా నేడు (ఏప్రిల్ 6 శ‌నివారం) రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈ సీజ‌న్‌లో ఆడిన మూడు మ్యాచుల్లో విజ‌యం సాధించింది రాజ‌స్థాన్. నేటి మ్యాచ్‌లోనే గెలిచి విజ‌య‌ప‌రంప‌ర‌ను కొన‌సాగించాల‌ని భావిస్తోంది.

మ‌రోవైపు ఆర్‌సీబీ ప‌రిస్థితి భిన్నంగా ఉంది. నాలుగు మ్యాచులు ఆడిన ఆ జ‌ట్టు కేవ‌లం ఒక్క మ్యాచ్‌లోనే విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలో ఆర్ఆర్‌తో మ్యాచ్‌లో ఆ జ‌ట్టు గెలుపొంద‌డం ఎంతో ముఖ్యం. ఈ నేప‌థ్యంలో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవ‌కాశం ఉంది. స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లి, కెప్టెన్ డుప్లెసిస్‌, గ్లెన్ మాక్స్‌వెల్‌, కామెరూన్ గ్రీన్‌, ర‌జ‌త్ పాటిదార్‌ల‌తో కూడిన బ్యాటింగ్ విభాగం చాలా ప‌టిష్టంగా క‌నిపిస్తోంది.

MS Dhoni : 3 బాల్స్ కోసం ధోని బ్యాటింగ్‌కు రావాలా? ఏంటిది రుతురాజ్‌..? కాస్త ముందు పంప‌వ‌య్యా!

అయితే.. కోహ్లి మిన‌హా మిగిలిన వారు నిల‌క‌డ‌గా ఆడ‌డం లేదు. మ‌హ్మ‌ద్ సిరాజ్‌, య‌శ్ ద‌యాల్‌, యయాంక్ దాగ‌ర్‌, రీస్ టాప్లీలు బౌలింగ్‌లో అంచ‌నాలు అందుకోవ‌డం లేదు. వీరంతా ఆర్ఆర్‌తో మ్యాచ్‌లో రాణించాల‌ని జ‌ట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటుంది. ఈ మ్యాచ్‌లోనూ ఓడితే ఆర్‌సీబీ ప్లే ఆఫ్ అవ‌కాశాలు క‌ష్టం అయ్యే సూచ‌న‌లు ఉన్నాయి.

సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం పిచ్ నివేదిక..
జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలోని పిచ్‌ బ్యాటర్ల‌కు స్వ‌ర్గ‌ధామం. బంతి మంచి బౌన్స్‌తో బ్యాట్‌పైకి వ‌స్తుంటుంది. ఇక్క‌డ టాస్ గెలిచిన జ‌ట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంటుంది.

హెడ్ టు హెడ్ రికార్డు..
ఐపీఎల్‌లో ఈ రెండు జ‌ట్లు 30 మ్యాచుల్లో ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఇందులో 12 మ్యాచుల్లో రాజ‌స్థాన్ విజ‌యం సాధించ‌గా 15 మ్యాచుల్లో బెంగ‌ళూరు గెలిచింది. మూడు మ్యాచుల్లో ఫ‌లితం తేల‌లేదు.

Kavya Maran : కావ్యా పాప మ‌ళ్లీ న‌వ్వింది.. ప‌క్క‌న ఉన్న అమ్మాయి ఎవ‌రో తెలుసా?

తుది జ‌ట్ల అంచ‌నా..
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్‌), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, కామెరూన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పటీదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్ కీప‌ర్‌), మయాంక్ దాగర్, రీస్ టోప్లీ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్