Virat Kohli : కోహ్లి ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే స్లోయెస్ట్ సెంచ‌రీ..

సెంచ‌రీ సాధించిన కోహ్లిపై నెట్టింట విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Virat Kohli : కోహ్లి ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే స్లోయెస్ట్ సెంచ‌రీ..

PIC Credit @RCB twitter

Virat Kohli Century : ప్లేస్ మారొచ్చు.. కానీ ఫ‌లితం మార‌దు అని నిరూపించింది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు. శ‌నివారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓట‌మి చ‌విచూసింది. ఈ సీజ‌న్‌లో రాజ‌స్థాన్‌కు ఇది వ‌రుస‌గా నాలుగో విజ‌యం కాగా.. బెంగ‌ళూరుకు హ్యాట్రిక్ ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ మొద‌ట బ్యాటింగ్ చేసింది. విరాట్ కోహ్లి(113 నాటౌట్; 72 బంతుల్లో 12 ఫోర్లు, 4సిక్స‌ర్లు) సెంచ‌రీ చేయ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు న‌ష్టానికి 183 ప‌రుగులు చేసింది. జోస్ బ‌ట్ల‌ర్ (100నాటౌట్; 58 బంతుల్లో 9ఫోర్లు, 4సిక్స‌ర్లు) శ‌త‌కంతో చెల‌రేగ‌గా, సంజూ శాంస‌న్‌(69; 42 బంతుల్లో 8 ఫోర్లు, 2సిక్స‌ర్లు) మెరుపు హాఫ్ సెంచ‌రీతో దుమ్ములేప‌డంతో రాజ‌స్థాన్ 19.1 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని ఛేదించింది.

కోహ్లి చెత్త రికార్డు.. విమ‌ర్శ‌లు..

సెంచ‌రీ సాధించిన కోహ్లిపై నెట్టింట విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. సెల్పిష్ కోహ్లి అంటూ ట్రోలింగ్‌కు దిగుతున్నారు. జ‌ట్టు ఓట‌మికి అత‌డే కార‌ణ‌మ‌ని అంటున్నారు. కోహ్లి ఎవ‌రూ కోరుకుని రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో స్లోయెస్ట్ సెంచ‌రీ చేసిన మ‌నీష్ పాండే స‌ర‌స‌న కోహ్లి నిలిచాడు.

Sourav Ganguly : ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు.. ముంబై అభిమానుల‌కు సౌర‌వ్ గంగూలీ సందేశం..

2009లో ఆర్‌సీబీ త‌రుపున మ‌నీష్ పాండే డెక్క‌న్ చార్జ‌ర్స్ పై 67 బంతుల్లో సెంచ‌రీ చేయ‌గా.. రాజ‌స్థాన్ మ్యాచ్‌లో కోహ్లి సైతం అన్నే బంతుల్లో శ‌త‌కాన్ని అందుకున్నాడు. కోహ్లి టీ20ల్లో 50 కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న మ్యాచుల్లో అత‌డి జ‌ట్టు 96 శాతం మ్యాచులు ఓడిపోయిందంటూ గ‌ణాంకాలు షేర్ చేస్తున్నారు.

ఇంకోవైపు ఆర్‌సీబీ అభిమానులు కోహ్లి ఇన్నింగ్స్‌ను కొనియాడుతున్నారు. బెంగ‌ళూరులోని మిగిలిన బ్యాటర్లు 48 బంతుల్లో 59 పరుగులే చేశారని మ్యాచ్ గణంకాలు చూపుతూ విరాట్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.

ఐపీఎల్‌లో స్లోయెస్ట్ సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్లు వీరే..

మనీష్ పాండే – 67 బంతులు
విరాట్ కోహ్లి – 67 బంతులు
సచిన్ టెండూల్కర్ – 66 బంతులు,
డేవిడ్ వార్నర్ – 66 బంతులు,
జోస్ బట్లర్ -66 బంతులు

MS Dhoni Fan : ఉప్ప‌ల్‌లో ధోని ఫ్యాన్‌కు షాకింగ్ అనుభ‌వం.. ‘నా సీటు క‌నిపించ‌డం లేదు.. ఎవ‌రైనా చూశారా?’