Ap Elections 2024 : ఎమ్మెల్యే ఇంటిపై దాడి, రబ్బరు బుల్లెట్లు ప్రయోగం.. నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత

ఈ ఘర్షణలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుపై దాడి చేశారు. చదలవాడ అరవింద్ బాబు కార్లు ధ్వంసం చేశారు వైసీపీ కార్యకర్తలు.

Ap Elections 2024 : ఎమ్మెల్యే ఇంటిపై దాడి, రబ్బరు బుల్లెట్లు ప్రయోగం.. నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత

Ap Elections 2024 : పల్నాడు జిల్లా నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు గొడవపడ్డారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని టీడీపీ కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ ఘర్షణలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుపై దాడి చేశారు. చదలవాడ అరవింద్ బాబు కార్లు ధ్వంసం చేశారు వైసీపీ కార్యకర్తలు. దీంతో ఒక్కసారిగా వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై దాడి చేశారు టీడీపీ వర్గీయులు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి ఇరువర్గాలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

చదలవాడ అరవింద్ బాబు ప్రచారానికి వెళ్లగా.. వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై మరొకరు రాళ్ల దాడి చేసుకున్నారు. ఆ తర్వాత ఇరువర్గాల చెందిన వాహనాలను ధ్వంసం చేసుకున్నారు. టీడీపీ, వైసీపీ నేతల ఇళ్లపైనా రాళ్ల దాడి జరిగింది. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేశారు. అల్లరి మూకలపై రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు.

Also Read : ఓటరుని కొట్టిన తెనాలి ఎమ్మెల్యేపై ఈసీ ఆగ్రహం.. స్పందించిన శివకుమార్