Bhuvaneshwar Kumar : భువ‌నేశ్వ‌ర్‌కుమార్‌కు షాక్‌.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ట్రెంట్ బౌల్ట్ ఒకే ఒక్క‌డు..

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బౌల‌ర్ ట్రెంట్ బౌల్ట్ అరుదైన రికార్డును సాధించాడు.

Bhuvaneshwar Kumar : భువ‌నేశ్వ‌ర్‌కుమార్‌కు షాక్‌.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ట్రెంట్ బౌల్ట్ ఒకే ఒక్క‌డు..

Trent Boult becomes player with most wickets in first over

Bhuvaneshwar Kumar – Trent Boult : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బౌల‌ర్ ట్రెంట్ బౌల్ట్ అరుదైన రికార్డును సాధించాడు. ఐపీఎల్ మ్యాచుల్లో అత్య‌ధిక సార్లు తొలి ఓవ‌ర్‌లోనే వికెట్ తీసిన ఆట‌గాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ క్ర‌మంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ స్టార్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్‌కుమార్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. బుధ‌వారం పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో బౌల్ట్ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 144 ప‌రుగులు చేసింది. రాయ‌ల్స్ బ్యాట‌ర్ల‌లో రియాన్ ప‌రాగ్ (34 బంతుల్లో 48) తృటిలో హాఫ్ సెంచ‌రీ చేజార్చుకోగా, ర‌విచంద్ర‌న్ అశ్విన్ (19 బంతుల్లో 28) లు రాణించాడు.

Gautam Gambhir : సంజూ శాంస‌న్ వ‌ద్దే వ‌ద్దు.. రిష‌బ్ పంత్ ముద్దు.. : గౌత‌మ్ గంభీర్‌

అనంత‌రం ఓ మోస్త‌రు ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కు ట్రెంట్ బౌల్ట్ షాకిచ్చాడు. మొద‌టి ఓవ‌ర్‌లోని నాలుగో బంతికి ప్రభ్‌సిమ్రన్ సింగ్ (6) ని ఔట్ చేశాడు. కాగా.. ఐపీఎల్‌లో ట్రెంట్ బౌల్ట్ ఇలా మొద‌టి ఓవ‌ర్‌లోనే వికెట్ ప‌డ‌గొట్ట‌డం ఇది 28వ సారి. హైద‌రాబాద్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ 27 సార్లు ఈ ఘ‌న‌త‌ను సాధించాడు. తాజాగా భువీ రికార్డును బౌల్ట్ బ‌ద్ద‌లు కొట్టాడు.

ఐపీఎల్‌లో అత్య‌ధిక సార్లు మొద‌టి ఓవ‌ర్‌లోనే వికెట్లు తీసిన ఆట‌గాళ్లు వీరే..
ట్రెంట్ బౌల్ట్ – 28 సార్లు
భువ‌నేశ్వ‌ర్ కుమార్ – 27
ప్ర‌వీణ్ కుమార్ – 15
దీప‌క్ చాహ‌ర్ – 13
సందీప్ శ‌ర్మ – 13
జ‌హీర్ ఖాన్ – 12

DC vs LSG : ఏమ‌య్యా గోయెంకా.. పంత్‌ను కౌగిలించుకున్నావ్ స‌రే.. రాహుల్‌తో మ‌ళ్లీ ఏందిది..

కెప్టెన్ సామ్ క‌ర‌న్ (41 బంతుల్లో 63 నాటౌట్‌) హాఫ్ సెంచరీతో మెర‌వ‌డంతో ల‌క్ష్యాన్ని పంజాబ్ 18.5 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాగా.. పంజాబ్ కింగ్స్ ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్ర‌మించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ బెర్తును దక్కించుకున్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు ఇది వ‌రుస‌గా నాలుగో ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం. ప్లే ఆఫ్స్‌కు ముందు రాజ‌స్థాన్‌ ఇలా వ‌రుస‌గా ఓడిపోవ‌డం ఆ జ‌ట్టు ఆత్మ‌విశ్వాసాన్ని దెబ్బ తీస్తుందన‌డంలో ఎటువంటి సందేహం లేదు.

ఇదిలా ఉంటే.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ నేడు (మే 16న‌) గుజ‌రాత్ టైటాన్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో భువ‌నేశ్వ‌ర్ తొలి ఓవ‌ర్‌లోనే వికెట్ ప‌డ‌గొట్టి బౌల్ట్ రికార్డును స‌మం చేస్తాడో లేదో చూడాలి మ‌రీ