KTR: చార్మినార్ వద్ద కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నేతల ఆందోళన

కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిహ్నాలను తొలగిస్తున్నారని ప్రచారం జరుగుతుండడంతో..

KTR: చార్మినార్ వద్ద కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నేతల ఆందోళన

తెలంగాణ రాజముద్రపై వివాదం రాజుకుంది. గత ప్రభుత్వం ఖరారు చేసిన ముద్రలో మార్పులు, చేర్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ సర్కారు వైఖరిపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. రాజముద్రలో రాచరికపు అన్నవాళ్లను తొలగిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ అభ్యంతరాలు తెలుపుతోంది.

కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిహ్నాలను తొలగిస్తున్నారని ప్రచారం జరుగుతుండడంతో వీటిని తొలగించరాదని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. చార్మినార్ దగ్గర బీఆర్ఎస్ నిరసనకు దిగింది. ఇందులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ 10టీవీతో మాట్లాడుతూ… ఇందిరా, ఎన్టీఆర్, కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి గొప్ప నేత కాదని అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

ఇది అనాలోచిత చర్య అని వ్యాఖ్యానించారు. తెలంగాణ గురించి కేసీఆర్ కంటే గొప్పగా ఆలోచించే వ్యక్తి రేవంత్ రెడ్డి కాదని అన్నారు. కాకతీయ చరిత్ర, హైదరాబాద్ చరిత్ర తెలియకుండా రేవంత్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాజముద్ర వ్యవహారంలో ప్రభుత్వ తీరు మారకపోతే ప్రజాక్షేత్రంలో పోరాడుతాం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు.

Also Read: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ వచ్చే అవకాశం లేదు: ప్రొఫెసర్ నాగేశ్వర్