ఆక్రమణల వల్లే ఖమ్మంలో వరదలు.. హరీశ్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన

ఖమ్మంలో ఆక్రమణల వల్లనే వదరలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో మున్నేరు వరద ముంపుకు గురైన ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.

ఆక్రమణల వల్లే ఖమ్మంలో వరదలు.. హరీశ్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన

CM Revanth

CM Revanth Reddy : ఖమ్మంలో ఆక్రమణల వల్లనే వదరలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో మున్నేరు వరద ముంపుకు గురైన ప్రాంతాలను సోమవారం సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. రాత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాసంలో బసచేశారు. ఇవాళ ఉదయం ఆయన మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. ఖమ్మంలో వరదలకు కారణం ఆక్రమణలేనని అన్నారు. గతంలో గొలుసు కట్టు చెరువులు ఉండేవన్నారు. మున్నేరు రిటైర్నింగ్ వాల్ ఎత్తు పెంచడం అనేది ఇంజనీర్లతో మాట్లాడిచూస్తాం.. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి అవసరం అనుకుంటే ఆక్రమణలు తొలగిస్తామని సీఎం తెలిపారు. మిషన్ కాకతీయ అనేదే కమీషన్ కాకతీయ అని దివంగత నాయిని నర్సింహారెడ్డి అసెంబ్లీలోనే చెప్పాడని రేవంత్ పేర్కొన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పటిష్టం చేశామని గత పాలకులు చెప్పుకున్నారు.. మరి గతంలో తెగని చెరువులు, ఇప్పుడు ఎందుకు తెగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Also Read : Jr NTR : తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. దేవర భారీ విరాళం.. ఎంతో తెలుసా?

దాదాపు 42సెంటీమీటర్ల వర్షం అంటే ఇది అత్యధిక వర్షపాతం. 75సంవత్సరాల్లో ఇంత వర్షం పడలేదు. అంతవిపత్తు జరిగినా ప్రాణనష్టాన్ని తగ్గించడం అంటే అది ప్రభుత్వ ముందు చూపే. వరదలపై మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు హాస్యాస్పదం. ఆయన ముందు మీ నాయకుడు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాలువలు ఆక్రమించి కట్టిన హాస్పిటల్ విషయంలో స్పందించాలి. హరీశ్ రావు అక్కడకు వెళ్లి దగ్గరుండి ఆక్రమణలు తొలగించమనిచెప్పి ఆదర్శంగా ఉండాలని సీఎం రేవంత్ అన్నారు.

Also Read : Nizampet : ఎస్ఆర్ రెసిడెన్షియల్ కాలేజ్‌ను సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు.. ఎందుకంటే?

తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన భారీ నష్టాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వంకు లేఖ రాశాం. వారినుంచి స్పందన రావాలని రేవంత్ రెడ్డి అన్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో మృతిచెందిన వారికి రూ. ఐదు లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించామని అన్నారు. వరదల సహాయంతో మా మంత్రులు ప్రజలతోనే ఉన్నారు. మా ప్రజలు మమ్మలను అడుగుతారు.. నిలదీస్తారు. వారు మావారే.. మాకు ఓటువేసి గెలిపించారు. మమ్మల్ని అడగకుంటే ఫాం హౌస్ లో పడుకున్న వారిని అడుగుతారా అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇటువంటి విపత్తు సమయంలో గతంలో ముఖ్యమంత్రులు హామీలు ఇచ్చారు.. కానీ అమలు చేయలేదు. మాది చేతల ప్రభుత్వం.. గత ప్రభుత్వ హామీలుకూడా మేము అమలు చేశారు. రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా విపత్తు నిర్వహణ సంస్థ సిద్ధం చేస్తున్నాం. ముందు బాధితులకు రూ.10వేలు తక్షణం అందిస్తామని చెప్పామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.