Rohit Sharma : ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు రోహిత్ శ‌ర్మ కీల‌క వ్యాఖ్య‌లు.. 150 ప‌రుగులు చేసినా చాలు..!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త జ‌ట్టు త‌మ తొలి స‌మ‌రానికి సిద్ధ‌మైంది.

Rohit Sharma : ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు రోహిత్ శ‌ర్మ కీల‌క వ్యాఖ్య‌లు.. 150 ప‌రుగులు చేసినా చాలు..!

Rohit Sharma hints at slow pitch for IND vs IRE match

Rohit : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త జ‌ట్టు త‌మ తొలి స‌మ‌రానికి సిద్ధ‌మైంది. మ‌రికొన్ని గంట‌ల్లో నాసా కంట్రీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలో ఐర్లాండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. స్థానిక కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు, భారత కాల‌మానం ప్ర‌కారం రాత్రి 8 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

ప్ర‌పంచ‌క‌ప్‌కు ఆతిథ్యం ఇస్తున్న అమెరికా, వెస్టిండీస్‌లోని పిచ్‌లు చాలా నెమ్మ‌దిగా ఉంటాయ‌న్నాడు. ఇక్క‌డ 140 లేదా 150 ప‌రుగులు చేసినా మంచి స్కోరు అవుతుంద‌న్నాడు. ఈ ల‌క్ష్యాల‌ను కాపాడుకోవ‌చ్చున‌ని చెప్పుకొచ్చాడు. అదే స‌మ‌యంలో ఐర్లాండ్‌ను త‌క్కువగా అంచ‌నా వేయ‌డం లేద‌న్నాడు. స్వ‌దేశంలో ఐర్లాండ్ ఇటీవ‌ల పాకిస్తాన్‌ను ఓడించిన విష‌యాన్ని గుర్తు చేశాడు.

Theekshana : ఇది అన్యాయం.. మా విష‌యంలో ఇలా చేయ‌డం త‌గ‌దు..!

పిచ్‌లు నెమ్మదిగా ఉన్న క్ర‌మంలో బ్యాటర్లు ఆచితూచి ఆడాల్సి ఉంటుంద‌న్నాడు. దూకుడుగా ఆడాల‌ని అనుకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌న్నాడు. ఇక ఐర్లాండ్‌తో ఆడే జ‌ట్టు విష‌య‌మై ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు. టీమ్ కాంబినేష‌న్ ఎలా ఉంటుందో త‌న‌కు తెలియ‌దన్నాడు. మొత్తం న‌లుగురు స్పిన్న‌ర్లు ఆడే అవ‌కాశాన్ని కొట్టి పారేయ‌లేమ‌న్నాడు. మూడు విభాగాల్లో రాణించిన జ‌ట్టు విజ‌యాన్ని అందుకుంటుంద‌న్నాడు.

ఇదిలా ఉంటే.. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో విజ‌యం సాధించి ప్ర‌పంచ‌క‌ప్‌లో ఘ‌నంగా బోణీ కొట్టాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Rahul Dravid : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఓపెన‌ర్‌గా విరాట్ కోహ్లి.. హెడ్ కోచ్ ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు..