జగన్‌ను కలవాలంటే పడిగాపులే..! జక్కంపూడి రాజా వ్యాఖ్యలతో ఏకీభవిస్తా- కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

దయచేసి.. నన్ను కలవడానికి ఎవరూ రావొద్దు. నాపై సానుభూతి చూపొద్దు. జాలి పడటం, బాధపటం నాకు నచ్చదు.

జగన్‌ను కలవాలంటే పడిగాపులే..! జక్కంపూడి రాజా వ్యాఖ్యలతో ఏకీభవిస్తా- కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Kethireddy Venkatarami Reddy : జగన్ హయాంలో సీఎంవో ఆఫీస్ అధికారుల తీరుపై వైసీపీ నేతలు ఒక్కొక్కరు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎంవో ఆఫీసు అధికారులు మాజీ ముఖ్యమంత్రి జగన్, ప్రజాప్రతినిధుల మధ్య గ్యాప్ క్రియేట్ చేశారని మండిపడుతున్నారు. జగన్ ను కలవాలంటే పడిగాపులే అని వాపోతున్నారు. తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి.. సీఎంవో ఆఫీస్ అధికారులపై ఫైర్ అయ్యారు. సంచలన ఆరోపణలు చేశారు. సీఎంవో ఆఫీస్ అధికారులు జగన్, ప్రజాప్రతినిధుల మధ్య గ్యాప్ క్రియేట్ చేశారని విరుచుకుపడ్డారు. తాజాగా ఆయన తన ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోని సోషల్ మీడియాలో పెట్టారు.

నిధుల కోసం 100 సార్లు తిరిగా..
”జగన్ ను కలిసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు చాలాసార్లు వెయిట్ చేసిన సందర్భం నేను చూశాను. లోపల ఎవరో కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. సీఎంవో ఆఫీసు ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి మధ్య గ్యాప్ ను క్రియేట్ చేయగలిగింది. నేరుగా జగన్ ను కలిసి సమస్యలు చెప్పుకోలేకపోయాము. ధర్మవరంలో ఫ్లైఓవర్ భూసేకరణ కోసం నేను 100 సార్లు తిరిగాను. బీటీ రోడ్డు కోసం గుంతలు పడిన రోడ్డు కోసం 20 సార్లు తిరిగాను. ఫైనాన్స్ సెక్రటరీ రావత్ చుట్టూ ఎన్నోసార్లు తిరిగా. భూసేకరణ కోసం అవసరమైన నిధులు రూ.15 కోట్లు ఇవ్వడానికి ఏడాది పట్టింది.

జగన్, ప్రజాప్రతినిధుల మధ్య గ్యాప్ క్రియేట్ చేశారు..
ఆ డబ్బులు ఏమైనా నా ఇంటికి వచ్చేదా? ఫ్లైఓవర్లు, రోడ్లు జనానికి సంబంధించినవి. వెంటపడి వెంటపడి చెప్పినా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ క్రియేట్ చేశారు. మా మధ్య రిలేషన్ చెడగొట్టారు. ధనుంజయ్ రెడ్డి లాంటి చెత్త అధికారి సీఎంగా వ్యవహరించాడు అంటూ
వైసీపీ నేత జక్కంపూడి రాజా చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తా.

పెన్షన్ పెంచుతూ పోతాను అని జగన్ చెప్పి ఉంటే బాగుండేది. చంద్రబాబు పెన్షన్ 4వేలు ఇస్తానని చెప్పారు. దాంతో.. నువ్వు ఏ సంక్షేమం అయితే ఇస్తానని అంటున్నావో.. అది చంద్రబాబు ఇప్పటి నుంచే ఇస్తానంటున్నారు కదా అని ప్రజలు నమ్మారు. మా ధర్మవరం నియోజకవర్గం నేతలు, కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. నాకు కొంతమంది ఫోన్లు చేసి పటాసులు కాలుస్తున్నారు అన్నా, మోటార్ సైకిల్స్ పై తిరుగుతున్నారు అన్నా అని చెబుతున్నారు. వాటిని పట్టించుకోవద్దు.

ఈ కష్ట సమయంలో కేడర్ ధైర్యంగా ఉండాలి..
టఫ్ సిటుయేషన్ లో కేడర్ ధైర్యంగా ఉండాలి. ఇలా చాలా చాలెంజింగ్, టఫ్ సమయం. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. 23 సీట్లతో ఉన్న చంద్రబాబు బౌన్స్ బ్యాక్ అయ్యారు. 2 సీట్ల నుంచి 150 సీట్లకు మనం బౌన్స్ బ్యాక్ అయ్యాం. పొలిటికల్ సిస్టమ్ లో ఏదైనా జరగొచ్చు. నాకు కొంతకాలం బ్రేక్ కావాలి. ఈ ఊహించని దాని నుంచి బయటపడాలి. మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు.

దయచేసి.. నన్ను ఒంటరిగా వదిలేయండి..
దయచేసి.. నన్ను కలవడానికి ఎవరూ రావొద్దు. నాపై సానుభూతి చూపొద్దు. జాలి పడటం, బాధపటం నాకు నచ్చదు. మీరు నన్ను చూసి బాధపడటం, నేను మిమ్మల్ని చూసి బాధపడటం ఇవన్నీ వద్దు. నేను దీన్ని నుంచి ఎంత త్వరగా బయటకు వస్తే అంత త్వరగా రెగులర్ వర్కింగ్ స్టైల్ లోకి వస్తాను. నాకు సానుభూతి వద్దు. దయచేసి నన్ను ఒంటరిగా కొన్ని రోజులు వదిలేయండి. నేను అందులోంచి బయటకు వస్తాను.

చంద్రబాబుకు ఇది మంచి అవకాశం..
నాకు రాజకీయం, సేవ తప్ప మరొకటి తెలియదు. ఎన్నికలు ఎలా జరిగాయో కూడా మీకు తెలుసు. ఈ ఐదేళ్లు మనం ఫేస్ చేయాలి. మీకు మీకుగా సమస్యను పరిష్కరించుకునే స్థాయికి ఎదగాలి. నాకు కొన్ని రోజులు సమయం కావాలి. నేను కూడా మనిషినే. నాకూ ఎమోషన్స్ ఉన్నాయి. చంద్రబాబుకి ఇది బెస్ట్ అవకాశం. బాబు లేకపోతే ఎన్డీయే ప్రభుత్వమే లేదు. ఈ అవకాశాన్ని చంద్రబాబు సద్వినియోగం చేసుకోవాలి. ఏపీ హక్కులను సాధిస్తారో, పదవులు తీసుకుని మౌనంగా ఉండిపోతారో చూడాలి. మావైపు వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అంటోంది, బీజేపీ వైపు ఉంటే పదవులు వస్తాయి. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి” అని కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి అన్నారు.

Also Read : కొడాలి నాని ఇంటిపై రాళ్లు, గుడ్లు విసిరిన టీడీపీ కార్యకర్తలు.. ఉద్రిక్తత