కేంద్రంలో కింగ్ మేకర్‌గా చంద్రబాబు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లబోతున్నారు?

ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏపీకి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, పోలవరం వంటి వాటిపై టీడీపీ కేంద్రం నుంచి స్పష్టమైన హామీ తెచ్చుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కేంద్రంలో కింగ్ మేకర్‌గా చంద్రబాబు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లబోతున్నారు?

Chandrababu Naidu : 2019 ఎన్నికల్లో కేవలం మూడంటే మూడు ఎంపీ సీట్లు, 23 అసెంబ్లీ స్థానాలతో ఘోర పరాభవం మూటకట్టుకున్న టీడీపీ ఐదేళ్లు తిరిగేసరికి చారిత్రక విజయం అందుకుంది. జనసేన, బీజేపీతో కలిసి ఊహించని గెలుపు సొంతం చేసుకుంది. ఈ ఎన్నికలు టీడీపీకి పునర్ వైభవం తెచ్చాయి. రాష్ట్రంలో అధికారాన్ని అందుకోవడమే కాదు జాతీయ రాజకీయాల్లోనూ చంద్రబాబు చక్రం తిప్పడానికి అవకాశం కల్పించాయి. మరి, కింగ్ మేకర్ గా మారిన టీడీపీ అధినేత ఏం చెయ్యబోతున్నారు? కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఎలా రాబట్టబోతున్నారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లబోతున్నారు?

నితీశ్ కుమార్ తో పొంచి ఉన్న ముప్పు..!
ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటులో టీడీపీ మద్దతు కీలకం కావడంతో కీలక మంత్రి పదవుల కోసం టీడీపీ పట్టుబడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, తమకు పదవులు ముఖ్యం కాదని, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చడమే అంతిమ లక్ష్యం అని చంద్రబాబు ప్రకటించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏపీకి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, పోలవరం వంటి వాటిపై టీడీపీ కేంద్రం నుంచి స్పష్టమైన హామీ తెచ్చుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాష్ట్రానికి అవసరమైన వాటి కోసం పట్టుపట్టడం తప్ప రాజకీయంగా టీడీపీ బెదిరింపులకు దిగబోదని, ఎన్డీయే కూటమిలో నమ్మదగ్గ మిత్రపక్షంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, 12మంది జేడీయూ ఎంపీలతో ఎన్డీయేకు కీలక మద్దతుదారుడిగా ఉన్న నితీశ్ కుమార్ నుంచి మాత్రం ఎన్డీయేకు ముప్పు పొంచి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read : జగన్‌ను కలవాలంటే పడిగాపులే..! జక్కంపూడి రాజా వ్యాఖ్యలతో ఏకీభవిస్తా- కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు