Kalki three Days Collections : కల్కి మూవీ కలెక్షన్ల సునామీ.. మూడు రోజుల్లో ఎంతంటే..?
బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది కల్కి మూవీ.
![Kalki three Days Collections : కల్కి మూవీ కలెక్షన్ల సునామీ.. మూడు రోజుల్లో ఎంతంటే..? Kalki three Days Collections : కల్కి మూవీ కలెక్షన్ల సునామీ.. మూడు రోజుల్లో ఎంతంటే..?](https://10tv.in/wp-content/uploads/2024/06/Prabhas-Kalki-2898-Ad-Movie-Three-Days-Collections.jpg)
Prabhas Kalki 2898 Ad Movie Three Days Collections
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మూవీ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ.415 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. ఓ సరికొత్త పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అదిరిపోయే యాక్షన్ సీన్స్, మహాభారతం విజువల్స్, ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. మొదటి రోజు (గురువారం) 191.5 కోట్లు, రెండవ రోజు (శుక్రవారం)107 కోట్లు వసూలను రాబట్టింది. ఇక మూడో రోజు శనివారం కావడంతో సినిమా వసూళ్లు భారీగా పెరిగాయి. మూడో రోజు 116.5కోట్లు రాబట్టింది. ఇక నేడు నాలుగో రోజు ఆదివారం కావడంతో కలెక్షన్లు ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది.
Team India : భారత్ ఇప్పుడు ప్రపంచ అగ్రభాగాన ఉంది.. టీమ్ఇండియాకు టాలీవుడ్ సెలబ్రిటీల అభినందనలు
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు. దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అన్నా బెన్, మాళవిక నాయర్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్ లు కీలక పాత్రలు పోషించారు.
The force is unstoppable…❤️🔥#Kalki2898AD #EpicBlockbusterKalki @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth pic.twitter.com/hAXIwStnOb
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 30, 2024