Pekamedalu : ‘పేక మేడలు’ రిలీజ్ డేట్ అనౌన్స్.. సెకండ్ సాంగ్ విడుదల..

తాజాగా పేక మేడలు సినిమా నుంచి రెండవ పాట విడుదల చేసారు. అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Pekamedalu : ‘పేక మేడలు’ రిలీజ్ డేట్ అనౌన్స్.. సెకండ్ సాంగ్ విడుదల..

Pekamedalu Movie Release Date Announce and second song Released

Pekamedalu : నా పేరు శివ, అంధగారం.. లాంటి పలు సినిమాల్లో నటించిన వినోద్ కిషన్ ‘పేక మేడలు’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అనూష కృష్ణ హీరోయిన్ గా క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాకేష్ వర్రే నిర్మాణంలో నీలగిరి మామిళ్ళ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఆల్రెడీ ఈ సినిమా నుంచి టీజర్, ఫస్ట్ సాంగ్ ను విడుదల చేసారు.

Also Read : Venu Swamy – Bigg Boss : తెలుగు బిగ్‌బాస్‌ 8లో వేణుస్వామి ఫిక్స్..? భారీగానే పారితోషికం..?

తాజాగా ఈ సినిమా నుంచి రెండవ పాట విడుదల చేసారు. అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ‘ఆనందం అత్తకు స్వాహా.. మనశాంతి మామకు స్వాహా.. ఆడదాని జన్మంతా స్వాహా..’ అంటూ ఆడపిల్ల మీద ఈ పాట సాగుతుంది. ఈ పాటకు భార్గవ కార్తీక్ లిరిక్స్ రాయగా స్మరణ్ సాయి సంగీత దర్శకత్వంలో సాకే రాజశేఖర్ పాడారు. ఈ పాటను రిలీజ్ చేస్తూ పేకమేడలు సినిమా జూలై 19న విడుదల చేస్తున్నట్టు తెలిపారు మూవీ యూనిట్. పేకమేడలు సినిమా నుంచి వచ్చిన ఎమోషనల్ సాంగ్ ని మీరు కూడా వినేయండి..