ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. భారత ప్లేయర్లను అభినందించిన ప్రధాని

Team India Meets PM Modi: ఆటగాళ్లతో ప్రధాని మోదీ మాట్లాడారు.

ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. భారత ప్లేయర్లను అభినందించిన ప్రధాని

టీ20 ప్రపంచ కప్‌ గెలిచిన టీమిండియాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఇవాళ ఉదయం టీమిండియా న్యూఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. అనంతరం మొదట క్రికెటర్లు ప్రత్యేక బస్సులో ఐటీసీ మౌర్య హోటల్‌కు వెళ్లారు.

అక్కడి నుంచి ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు 7 లోక్ కల్యాణ్ మార్గ్‌కు వెళ్లింది టీమిండియా. ఆటగాళ్లతో ప్రధాని మోదీ మాట్లాడారు. మోదీంతో కలిసి భారత ఆటగాళ్లు బ్రేక్ ఫాస్ట్ చేశారు. కాగా, ఇవాళ సాయంత్రం ముంబైలో టీమిండియా రోడ్ షోలో పాల్గొననుంది. దీంతో ముంబైలో పోలీసులు ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం కోసం దక్షిణ ముంబైలోని ఏడు రోడ్లను మూసివేశారు.

పలు ప్రాంతాల్లో పార్కింగ్ పై తాత్కాలిక నిషేధం విధించారు. ఇవాళ ఉదయం టీమిండియాకు న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఐటీసీ మౌర్య హోటల్‌ వద్ద కూడా భారత క్రికెటర్లకు అక్కడి వారు ఘనస్వాగతం పలికారు. 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్ గెలుచుకున్న టీమిండియా 13 ఏళ్ల తర్వాత ఐసీపీ ట్రోఫీని చేజిక్కించుకుంది.

శనివారం జరిగిన ఫైనల్‌లో భారత్ ఏడు పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి ఫైనల్‌లో విజయం సాధించింది. విరాట్ కోహ్లి 76 పరుగులు చేయడంతో భారత్ స్కోరు 176/7గా నమోదైంది. ఆ లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఛేదించలేకపోయింది.

Also Read: అందరి ముందు డ్యాన్స్ చేసిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్