Crop Cultivation : సరిపడా కురవని వర్షాలు.. ఆందోళనలో రైతులు.. పంటల సాగుకు ఇంకా సమయం ఉందంటున్న శాస్త్రవేత్తలు 

నైరుతి రుతుపవనాల సమయానికే ప్రారంభమైన.. మందకొడిగా కొనసాగుతోంది. అయినప్పటికీ ఖరీఫ్‌ పంటల సాగు జోరందుకుంది. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు.

Crop Cultivation : సరిపడా కురవని వర్షాలు.. ఆందోళనలో రైతులు.. పంటల సాగుకు ఇంకా సమయం ఉందంటున్న శాస్త్రవేత్తలు 

farmers suffering from rain for cultivation in telugu

farmers Crop cultivation : నెలరోజుల ముందు ప్రారంభించాలనుకున్న వానాకాలం వ్యవసాయ సీజన్‌ అనావృష్టి కారణంగా నెల ఆలస్యంగా ప్రారంభమవుతుంది. రైతులు భయభయంగానే సాగు పనులు చేపడుతున్నారు. లోటు వర్షపాతం ఉన్నప్పటికీ సీజన్‌ సాధారణ విస్తీర్ణంలో ఇప్పటివరకు 29 శాతమే పంటలను వేశారు. అయితే ముందు ముందు వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున రైతులు అదైర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. ఏఏ పంటలను ఎప్పటి వరకు విత్తుకోవచ్చో తెలియజేస్తున్నారు.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

నైరుతి రుతుపవనాల సమయానికే ప్రారంభమైన.. మందకొడిగా కొనసాగుతోంది. అయినప్పటికీ ఖరీఫ్‌ పంటల సాగు జోరందుకుంది. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. అదును దాటిపోతోందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

వానాకాలం ప్రారంభమై నెలవుతున్నా కొన్నిచోట్ల చినుకు జాడ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం మొదటి నుంచే కష్టాలు ప్రారంభమయ్యాయి. జూన్‌లో కళ్లు కాయలు కాసేలా వర్షాల కోసం ఎదురు చూసిన రైతులకు.. ప్రస్తుతం అడపాదడప కురిసిన వర్షాలకు కొంత మంది రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. చాలా చోట్ల సరిపడ వర్షాలు పడలేదు.

అయితే రైతులు అదైర్య పడోద్దని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జులై 15 వరకు మొక్కజొన్న, 20 వరకు పత్తి, నెల చివరి వరకు కందిలాంటి పంటలను విత్తుకోవచ్చంటున్నారు. ఇప్పటికే విత్తిన పత్తిని కాపాడుకునేందుకు నీటి వసతి ఉన్న రైతులు స్ప్రింక్లర్ల  ద్వారా నీటి తడులు అందించాలని సూచిస్తున్నారు. వర్షాలు ఆలస్యమైతే ఎలాంటి పంటలు వేసుకోవాలో కూడా శాస్త్రవేత్తలు ప్రణాళికలను రూపొందించారు.

Read Also : Kharif Kandi Cultivation : పెరిగిన కంది సాగు విస్తీర్ణం.. అధిక దిగుబడి కోసం సాగులో పాటించాల్సిన మెళకువలు