Shashi Tharoor : లంక ప‌ర్య‌ట‌న‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌.. సెల‌క్ట‌ర్ల‌పై శ‌శి థ‌రూర్ మండిపాటు..

ఈ నెలాఖ‌రులో భార‌త జ‌ట్టు శ్రీలంక ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది.

Shashi Tharoor : లంక ప‌ర్య‌ట‌న‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌.. సెల‌క్ట‌ర్ల‌పై శ‌శి థ‌రూర్ మండిపాటు..

Shashi Tharoor Harsh Dig At Selectors Over India Squad For SriLanka Tour

Shashi Tharoor : ఈ నెలాఖ‌రులో భార‌త జ‌ట్టు శ్రీలంక ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఆతిథ్య లంక‌తో భార‌త్ మూడు టీ20లు, మూడు వ‌న్డేలు ఆడ‌నుంది. లంక టూర్‌లో పాల్గొనే భార‌త జ‌ట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. హెడ్ కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన గంభీర్‌తో క‌లిసి చీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ నేతృత్వంలో ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేశారు. వ‌న్డేల్లో సంజూశాంస‌న్‌ను, టీ20ల్లో అభిషేక్ శ‌ర్మ‌ను ఎంపిక చేయ‌లేదు. దీనిపై లోక్‌సభ ఎంపీ, క్రికెట్‌కు వీరాభిమాని అయిన శశి థరూర్ మండిప‌డ్డాడు.

బీసీసీఐ ఎంపిక కమిటీపై విరుచుకుపడ్డారు. ఈ నెలాఖ‌రులో భార‌త జ‌ట్టు లంక ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. అందుకోసం బీసీసీఐ ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసింది. ‘త‌న చివ‌రి వ‌న్డేలో సెంచ‌రీ కొట్టిన సంజూశాంస‌న్‌కు వన్డేల్లో చోటు లేదు. అదే విధంగా జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో శ‌త‌కం సాధించిన అభిషేక్ శ‌ర్మ‌కు టీ20ల్లో స్థానం లేదు. ఇలాంటి మంచి ఇన్నింగ్స్‌లు ఆడే వారి ప్ర‌ద‌ర్శ‌న సెల‌క్ట‌ర్ల‌కు చాలా చిన్న విష‌యంగా అనిపించ‌వ‌చ్చు. లంక ప‌ర్య‌ట‌కు ఎంపికైన ఆట‌గాళ్ల‌కు అభినంద‌న‌లు. ఆల్ ది బెస్ట్.’ అని అన్నారు.

Hardik Pandya : నటాషా స్టాంకోవిచ్‌తో హార్దిక్ పాండ్యా విడాకులు.. ఇన్‌స్టా పోస్టుతో వెల్ల‌డి..

శ్రీలంక‌తో టీ20 సిరీస్‌కు సూర్య‌కుమార్ యాద‌వ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. వైస్ కెప్టెన్‌గా శుభ్‌మ‌న్ గిల్‌ను ఎంపిక చేశారు. వన్డే జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి చోటు కల్పించారు. వ‌న్డేల్లో రోహిత్ సార‌థ్యంలోనే భార‌త్ బ‌రిలోకి దిగ‌నుండ‌గా, గిల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు.

శ్రీలంక పర్యటనకు భారత జట్టు..

టీ20 జట్టు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), సంజూ శాంసన్ (వికెట్ కీప‌ర్‌), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మ‌హమ్మద్ సిరాజ్.

IND vs PAK : ఇవాళ భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్.. మనోళ్లు సత్తాచాటేనా..

వన్డే జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్. సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్‌, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.