IND vs PAK : అదరగొట్టారు.. ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో పాక్‌ను చిత్తుచేసిన భారత మహిళల జట్టు

పాకిస్థాన్ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే, పాక్ బ్యాటర్లను భారత బౌలర్లు క్రీజులో కుదురుకోనివ్వలేదు. అద్భుతమైన బౌలింగ్ తో వరుసగా ..

IND vs PAK : అదరగొట్టారు.. ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో పాక్‌ను చిత్తుచేసిన భారత మహిళల జట్టు

Womens Indian team

Womens Asia Cup T20 2024 : మహిళల ఆసియా కప్ -2024 టీ20 టోర్నీలో భాగంగా భారత్ జట్టు తొలి మ్యాచ్ పాకిస్థాన్ జట్టుతో ఆడింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో హర్మన్ ప్రీత్ బృందం ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్మృతి మందాన, పెఫాలివర్మ దూకుడైన బ్యాటింగ్ కు తోడు.. దీప్తిశర్మ, పూజ, శ్రేయాంక, రేణుక అద్భుత బౌలింగ్ తో పాకిస్థాన్ జట్టు చిత్తయింది. కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

Also Read : Natasa Stankovic : విడాకుల ప్ర‌క‌ట‌న త‌రువాత‌.. హార్దిక్ పాండ్యా భార్య తొలి పోస్ట్‌..

పాకిస్థాన్ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే, పాక్ బ్యాటర్లను భారత బౌలర్లు క్రీజులో కుదురుకోనివ్వలేదు. అద్భుతమైన బౌలింగ్ తో వరుసగా పెవిలియన్ బాటపట్టించారు. తొమ్మిది పరుగులకే పాక్ జట్టు తొలివికెట్ కోల్పోయింది. ఆ తరువాత పాక్ బ్యాటర్లలలో ఏఒక్కరూ క్రీజులో నిలదొక్కుకోలేక పోయారు. దీప్తి శర్మ అద్భుత బౌలింగ్ తో 4ఓవర్లలో కేవలం 20 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. రేణుకా సింగ్, శ్రేయాంక పాటిల్, పూజ తలా రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో పాకిస్థాన్ జట్టు 19.2ఓవర్లకు ఆలౌట్ అయ్యి కేవలం 108 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Also Read : ENG vs WI : వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. తొలి రోజే ఇంగ్లాండ్ వ‌ర‌ల్డ్ రికార్డు..

109 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ బ్యాటర్లు ఆది నుంచి దూకుడుగా ఆడారు. ఓపెనర్లు పెషాలి (40), స్మృతి (45) దూకుడుగా ఆడారు. దీంతో తొలి వికెట్ కోల్పోయే సరికి 85 పరుగుల భాగస్వామ్యం లభించింది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన హేమలత 14 పరుగులకు ఔట్ కాగా.. హర్మన్ ప్రీత్ (5 పరుగులు నాటౌట్) చివరి వరకు ఆడారు. దీంతో 14.1 ఓవర్లలో భారత్ జట్టు 109 పరుగుల లక్ష్యాన్ని ఛేదిచి అద్భుత విజయం సాధించింది. తద్వారా మహిళల ఆసియాకప్ టోర్నీ20 టైటిల్ ను నిలబెట్టుకునే దిశగా భారత్ జట్టు ఘనంగా అడుగేసింది.