Purushothamudu : రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’ ట్రైలర్ చూశారా..? సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?

తాజాగా రాజ్ తరుణ్ పురుషోత్తముడు ట్రైలర్ రిలీజ్ చేశారు.

Purushothamudu : రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’ ట్రైలర్ చూశారా..? సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?

Raj Tarun Purushothamudu Movie Trailer Released

Purushothamudu Trailer : రాజ్ తరుణ్, హాసిని సుధీర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘పురుషోత్తముడు’. శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మాణంలో రామ్ భీమన దర్శకత్వంలో పురుషోత్తముడు సినిమా నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా.. లాంటి చాలా మంది స్టార్స్ ఈ సినిమాలో నటించగా పురుషోత్తముడు జులై 26న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజవ్వగా తాజాగా పురుషోత్తముడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే హీరో బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చి ఓ పల్లెటూళ్ళో ఎవరికి తెలియకుండా ఉన్నట్టు, అతన్ని చంపడానికి శత్రువులు ట్రై చేస్తున్నట్టు ఉంది. ట్రైలర్ చూస్తుంటే పురుషోత్తముడు కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. మీరు కూడా పురుషోత్తముడు ట్రైలర్ చూసేయండి..

ఇక ట్రైలర్ లాంచ్ సందర్భంగా దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ.. పురుషోత్తముడు సినిమా ట్రైలర్ కు తక్కువ టైంలోనే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, యాక్షన్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ పురుషోత్తముడు సినిమాని తెరకెక్కించాము. ఈ సినిమా థియేటర్స్ లో ఒక పండగ లాంటి వాతావరణం తీసుకొస్తుంది అని తెలిపారు.

Also Read : Mahesh Babu : సితార పాప బ‌ర్త్‌డే.. స్పెష‌ల్ విషెస్ చెప్పిన మహేశ్, నమ్రతా

నిర్మాత ప్రకాష్ తేజావత్, రమేష్ తేజావత్ మాట్లాడుతూ.. నిర్మాతగా ఒక మంచి సినిమా చేసాము. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సినిమా. ఈ నెల 26వ తేదీన థియేటర్స్ లో రిలీజవుతుంది. సకుటుంబంగా సినిమాకు వచ్చి చూడండి, మీరంతా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అని తెలిపారు.