Rashmika – Triptii Dimri : రష్మిక వర్సెస్ యానిమల్ భామ.. నేషనల్ క్రష్ ట్యాగ్‌పై త్రిప్తి దిమ్రీ ఏమందంటే..

తాజాగా ఈ నేషనల్ క్రష్ అనే ట్యాగ్ పై త్రిప్తి దిమ్రీ స్పందించింది.

Rashmika – Triptii Dimri : రష్మిక వర్సెస్ యానిమల్ భామ.. నేషనల్ క్రష్ ట్యాగ్‌పై త్రిప్తి దిమ్రీ ఏమందంటే..

Rashmika Mandanna Vs Triptii Dimri National Crush Tag Issue

Rashmika – Triptii Dimri : మన హీరోలకు, హీరోయిన్స్ కు ఏదో ఒక ట్యాగ్ అభిమానులు లేదా సినిమా వాళ్లే ఇస్తూ ఉంటారు. అలా రష్మిక మందన్నకు నేషనల్ క్రష్ అనే ట్యాగ్ ఇచ్చారు. కొన్నేళ్ల నుంచి నేషనల్ క్రష్ అంటే రష్మిక అనే వైరల్ అయింది. కానీ గత సంవత్సర కాలంగా ఈ ట్యాగ్ కోసం ఇంకో హీరోయిన్ కూడా పోటీ పడుతుంది. యానిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించి తన అందంతో, నటనతో ప్రేక్షకులని మెప్పించింది త్రిప్తి దిమ్రీ.

యానిమల్ సినిమాలో రష్మిక ఉన్నా కూడా త్రిప్తి దిమ్రీ తనని డామినేట్ చేసింది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయింది త్రిప్తి దిమ్రీ. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగింది, సినిమా ఆఫర్స్, యాడ్స్, ప్రమోషన్స్ తెగ వచ్చేస్తున్నాయి. ఈ సినిమా తర్వాత కూడా త్రిప్తి దిమ్రీ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పెట్టడంతో మరింత వైరల్ అయింది. దీంతో సినిమా రిలీజ్ తర్వాత కొంతమంది నేషనల్ క్రష్ రష్మిక కాదు త్రిప్తి దిమ్రీ అని కామెంట్స్ చేశారు.

Also Read : Sitara Ghattamaneni : వామ్మో ఈ ఏజ్ లోనే.. జిమ్‌లో సితార పాప ఏ రేంజ్‌లో కష్టపడుతుందో చూడండి..

పలువురు నెటిజన్లు, త్రిప్తి దిమ్రీ అభిమానులు నేషనల్ ఆమెని నేషనల్ క్రష్ అని పిలుస్తూ మాట్లాడినా, పోస్టులు చేసినా అసలు త్రిప్తి దిమ్రీ పట్టించుకోలేదు. కానీ తాజాగా ఈ నేషనల్ క్రష్ అనే ట్యాగ్ పై త్రిప్తి దిమ్రీ స్పందించింది. త్రిప్తి దిమ్రీ నటించిన బ్యాడ్ న్యూస్ సినిమా ఈ శుక్రవారం రిలీజయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రెస్ మీట్ లో త్రిప్తి దిమ్రీని నేషనల్ క్రష్ ట్యాగ్ గురించి అడగడంతో సమాధానమిచ్చింది.

త్రిప్తి దిమ్రీ మాట్లాడుతూ.. బాలీవుడ్ లో నా కెరీర్ మొదలుపెట్టి దాదాపు ఏడేళ్లు అవుతుంది. మొదట్లో నేను యాక్టింగ్ సీరియస్ గా తీసుకోలేదు. కానీ ప్రేక్షకులు నాకు కనెక్ట్ అవ్వడంతో నటనపై దృష్టి పెట్టా. నేషనల్ క్రష్ అనేది ఒక ట్యాగ్ మాత్రమే కాదు అభిమానుల ప్రేమ. వాళ్ళు నన్ను అలా పిలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది నాపై మరింత బాధ్యత పెంచింది. ప్రేక్షకులను, అభిమానులని మెప్పించే సినిమాలు ఇకపై మరిన్ని చేస్తాను అని తెలిపింది.

Also Read : Hero Darshan : హీరో కోసం జైలుకి వెళ్లిన డైరెక్టర్.. ఎందుకో తెలుసా?

దీంతో త్రిప్తి దిమ్రీ నేషనల్ క్రష్ అనే ట్యాగ్ తీసుకుందని, అందరూ అలా పిలవడాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో రష్మిక కూడా నేషనల్ క్రష్ ట్యాగ్ పై సంతోషం వ్యక్తం చేస్తూ మాట్లాడింది. మరి ఇపుడు త్రిప్తి దిమ్రీ నేషనల్ ట్యాగ్ ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ మాట్లాడింది. దీనిపై రష్మిక, రష్మిక అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.