SS Rajamouli: ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్న జక్కన్న మూవీ.. ఎందుకో తెలుసా?

మూడు పార్టులుగా వస్తున్న ఈ సినిమాలో VFX గ్రాఫిక్స్‌ కోసమే సగం బడ్జెట్ ఖర్చు..

SS Rajamouli: ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్న జక్కన్న మూవీ.. ఎందుకో తెలుసా?

Rajamouli

రాజమౌళి సినిమా అంటేనే భారీ బడ్జెట్‌… ఎంత ఖర్చు చేస్తారో అంతకు రెండింతలు రాబడతారు… అందుకే నిర్మాతలు కూడా రాజమౌళి ఎంత అంటే… అంత బడ్జెట్‌కు ఓకే చేసేస్తుంటారు. బాహుబలి, బాహుబలి-2, ట్రిపుల్‌ ఆర్‌.. ఇవన్నీ భారీ బడ్జెట్‌ చిత్రాలే… కలెక్షన్ల సునామీ సృష్టించిన సినిమాలే… అందుకే రాజమౌళి మూవీస్‌ బడ్జెట్‌పై అందరిలోనూ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఎక్కువగా ఉంటాయి… ఇక ప్రిన్స్‌ మహేశ్‌బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం అంచనాలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి… గతంలో వెయ్యి కోట్లు అనుకున్న సినిమా.. బడ్జెట్‌ ఇప్పుడు మరింత రెట్టింపు అయ్యిందట…

దర్శక ధీరుడు రాజమౌళి, ప్రిన్స్‌ మహేశ్‌బాబు కాంబోలో వస్తున్న యాక్షన్‌ ఓరియంటెడ్‌ మూవీ బడ్జెట్‌ అంతకంతకూ పెరిగిపోతోంది. తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడూ ఖర్చుచేయనంత ఎక్కువ బడ్జెట్‌తో సినిమా నిర్మించాలని ప్లాన్‌ చేస్తున్నారట… మూడు పార్టులుగా వస్తున్న ఈ సినిమా నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకూడదనే ఉద్దేశంతో బడ్జెట్‌ విషయంలో నిర్మాతలు కూడా వెనక్కి తగ్గడంలేదంటున్నారు.

రాజమౌళి సినిమా అంటేనే ‘భారీ’తనం
వాస్తవానికి రాజమౌళి సినిమా అంటేనే భారీ బడ్జెట్ ఉంటుంది. స్టార్ కాస్ట్ కూడా భారీ స్థాయిలో ఉంటుంది. బాహుబలి పార్ట్1కి 180 కోట్ల రూపాయలు వెచ్చిస్తే… బాహుబలి పార్ట్ 2కి 250 కోట్లు ఖర్చు చేశారు నిర్మాతలు. ఇక ఆర్.ఆర్.ఆర్ నిర్మాణానికి ఏకంగా 550 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అయితే ఎంత ఎక్కువ ఖర్చు చేస్తారో.. అంతేస్థాయిలో వసూళ్లు ఉండటం వల్ల రాజమౌళి సినిమాలకు డబ్బు పెట్టుబడి పెట్టడంలో భయపడరు నిర్మాతలు.

ఎంత ఎక్కువ బడ్జట్ పెడితే అంత ఎక్కువ వసూళ్లు ఉంటాయనేది రాజమౌళి స్ట్రాటజీ. అందుకే ఆయన సారథ్యంలో నిర్మించిన బాహుబలి వన్‌ 650 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేస్తే… బాహుబలి2 వరల్డ్ వైడ్‌గా 1810 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఆర్ ఆర్ ఆర్ కూడా 1,387 కోట్లు వసూలు చేసి నిర్మాతలకు భారీ లాభాలు మిగిల్చింది. ఇప్పుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మహేశ్‌బాబు చిత్రం కూడా దాదాపు ఈ సినిమాలు మాదిరిగా భారీ బడ్జెట్‌ ఉంటుందనే అంతా అంచనా వేశారు.

బాపురే ఇంత బడ్జెటా?
ఫ్యాన్స్‌ అనుకున్నట్లు మహేశ్‌ సినిమాకు దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు అవుతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఐతే ఇప్పుడు ఆ మొత్తం కూడా పెరిగిపోయింది. ఈ సినిమాకు బడ్జెట్ గురించి తెలిసి టాలీవుడ్‌లో అంతా షాక్ అవుతున్నారు. బాపురే ఇంత బడ్జెటా? అంటూ ఎంక్వయిరీ చేస్తున్నారు.

ముందుగా వెయ్యి కోట్లు అనుకుంటే ఇప్పుడు మరో 500 కోట్ల రూపాయలు బడ్జెట్‌ పెరిగిందంట. అంటే ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన ఏ చిత్రానికి చేయనంత ఖర్చు మహేశ్‌ సినిమాలో పెడుతున్నారన్నమాట… ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో భారీ బడ్జెట్‌ సినిమాలుగా చెప్పే మూడు చిత్రాల మొత్తం బడ్జెట్‌కు రెండింతలు… మహేశ్‌ సినిమాకు పెడుతున్నారని టాలీవుడ్‌ టాక్‌.

అయితే ఈ స్థాయిలో బడ్జెట్ పెరగటానికి కారణం VFX కోసమే అని తెలుస్తోంది. మూడు పార్టులుగా వస్తున్న ఈ సినిమాలో VFX గ్రాఫిక్స్‌ కోసమే సగం బడ్జెట్ ఖర్చు అవుతుందని అంటున్నారు. ఈ సినిమాకు KL Narayana నిర్మాతగా వ్యవహరించబోతుండగా, సెప్టెంబర్‌ చివరి వారంలో షూటింగ్‌ ప్రారంభయ్యే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇంత భారీ బడ్జెట్‌ పెడుతుండటం వల్ల సినిమా టికెట్‌ రేట్లు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ఇప్పటి నుంచే బెంగ పెట్టుకుంటున్నారు అభిమానులు. మొత్తానికి తెలుగుచిత్ర సీమలో కనీవినీ ఎరుగని విధంగా బడ్జెట్‌ పెడుతుండటమే ఇప్పడు హాట్‌టాపిక్‌గా మారింది.

Also Read: ‘పలాస’ సక్సెస్‌ని నేను వాడుకోలేదు.. ఆ కాంటెస్ట్ కోసం 1000 సిల్వర్ కాయిన్స్ ఆల్రెడీ కొన్నాను..