Anasuya : మీ హీరోలాగా ఆడవాళ్ళని తిట్టడం మాత్రమే వచ్చు మీకు.. సోషల్ మీడియాలో మళ్ళీ అనసూయ..

తాజాగా అనసూయ ఎవర్ని డైరెక్ట్ గా ఉద్దేశించకుండా ఓ ట్వీట్ చేసింది.

Anasuya : మీ హీరోలాగా ఆడవాళ్ళని తిట్టడం మాత్రమే వచ్చు మీకు.. సోషల్ మీడియాలో మళ్ళీ అనసూయ..

Anasuya Sensational Tweet against Vijay Devarakonda Indirectly Tweet goes Viral

Anasuya : అనసూయ తన సినిమాలతో, తన సోషల్ మీడియా పోస్టులతో, తన హాట్ ఫొటోలతో రెగ్యులర్ గా వైరల్ అవుతుంది. అనసూయపై ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేస్తే వాళ్ళకి గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. అయితే ఇటీవల ఎక్కువగా అలాంటి నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోకపోయినా గతంలో మాత్రం రెగ్యులర్ గా తన సోషల్ మీడియా కామెంట్స్ తో వైరల్ అవుతూ ఉండేది.

ముఖ్యంగా అనసూయ – విజయ్ దేవరకొండ ఇష్యూతో బాగా వైరల్ అయింది. విజయ్ దేవరకొండ – అనసూయ గొడవ చాలా రోజులే సాగింది. దానికి తోడు విజయ్ ఫ్యాన్స్ అనసూయని టార్గెట్ చేయడంతో మరింత ఫైర్ అయ్యేది. ఇటీవల కొన్ని రోజుల క్రితం నేను ఇక ఆ గొడవలు పట్టించుకోను అని ఓ ఈవెంట్లో చెప్పింది. అప్పట్నుంచి మళ్ళీ అనసూయ కాంపౌండ్ లో విజయ్ దేవరకొండ పేరు వినపడలేదు.

Also Read : Vignesh Shivan : LIC దెబ్బకి సినిమా టైటిల్ మార్చేసిన నయనతార భర్త..

తాజాగా సింబా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మళ్ళీ విజయదేవరకొండ ఇష్యూ గురించి వచ్చింది. సింబా ట్రైలర్ లో విజయ్ దేవరకొండ పేరు వాడుతూ ఓ డైలాగ్ చెప్పారు. దీనికి ఓ మీడియా ప్రతినిధి మీకు, విజయ్ దేవరకొండకి గొడవలు ముగిసినట్టేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? అని అడగ్గా అనసూయ.. నాకు ఏం గొడవలు లేవు. ఒక ఫేమ్ లో ఉన్నప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాళ్ళు అలా మాట్లాడితే మీరు కూడా సైలెంట్ గానే ఉన్నారు. మీకు తప్పనిపించలేదు. ఇవి అతన్ని అడగరు. నన్నే అడుగుతారు. నేను ఆయనలాగా ఆమెను అడగండి అని అగౌరవంగా మాట్లాడను. నేను ఎవర్ని హేట్ చెయ్యట్లేదు. ఒక సంఘటనలో తప్పు జరిగితే నేను ప్రశ్నించాను అంతే అని చెప్పింది. దీంతో అనసూయ కామెంట్స్ వైరల్ అవ్వగా మరోసారి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

తాజాగా అనసూయ ఎవర్ని డైరెక్ట్ గా ఉద్దేశించకుండా ఓ ట్వీట్ చేసింది. అనసూయ తన ట్వీట్ లో.. మరీ ఇంత చాతకాని వాళ్ళ లాగా ఉంటే ఎలాగండి. నిజంగా మీకు కాలుతుందంటే నా మీద కాదు. అస్తమానం నేను ఏం పని చేసినా ఆ టాపిక్ లాగే వాళ్ళని అనండి దమ్ముంటే. కానీ మీరు అలా చెయ్యరు కదా. ఎందుకంటే మీకు అది చేతకాదు. మీ హీరో లాగా ఆడవాళ్ళని ఉద్దేశించి బూతులు తిట్టడం మాత్రమే వచ్చు కదా పాపం. నేను ఇప్పటికి మీ అందరి గురించి ప్రార్థిస్తాను మీరు మంచి పని చేసుకోవాలని అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అనసూయ ఏ హీరోని ఉద్దేశించి అని చెప్పకపోయినా విజయ్ దేవరకొండ గురించే అని అందరికి అర్ధమవుతుంది. మరి ఈ ట్వీట్ పై విజయ్ ఫ్యాన్స్ ఏమంటారో చూడాలి.