Pranita Subhash : రెండో సారి ప్రగ్నెంట్ అయిన హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసి..
కరోనా సమయంలోనే వ్యాపారవేత్త నితిన్ రాజుని పెళ్లి చేసుకొని 2022లో మొదటి బిడ్డకు జన్మనిచ్చింది హీరోయిన్ ప్రణీత.

Actress Pranita Subhash got Second time Pregnancy Baby Bump Photos goes Viral
Pranita Subhash : ఏం పిల్లో.. ఏం పిల్లడో సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ ప్రణీత ఆ తర్వాత బావ, రభస, డైనమైట్, అత్తారింటికి దారేది.. ఇలా పలు సినిమాలతో మెప్పించింది. తెలుగులో స్టార్ హీరోయిన్ కాకపోయినా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ప్రణీత. హీరోయిన్ గానే కాక కరోనా సమయంలో కర్ణాటకలో అనేక సేవా కార్యక్రమాలు చేసి మరింత పాపులర్ అయింది ప్రణీత.
కరోనా సమయంలోనే వ్యాపారవేత్త నితిన్ రాజుని పెళ్లి చేసుకొని 2022లో మొదటి బిడ్డకు జన్మనిచ్చింది ప్రణీత. అప్పుడప్పుడు తన పాప ఆర్నతో కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు, వీడియోలు పీస్ చేసేది ప్రణీత. తల్లి అయిన తర్వాత కూడా కొన్ని సినిమాలు, టీవీ షోలలో కనిపించింది. తాజాగా ప్రణీత రెండో సారి ప్రగ్నెంట్ అయింది.
Also Read : Samantha – Ali Fazal : మీర్జాపూర్ గుడ్డు భాయ్‌తో సమంత.. వెబ్ సిరీస్ కోసం..
సోషల్ మీడియాలో తన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేస్తూ.. రౌండ్ 2.. నా ప్యాంట్స్ ఇప్పుడు సరిపోవట్లేదు అని ఆసక్తిగా పోస్ట్ చేసింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు.