Pawan Kalyan : పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర పై ఆ షోలో పిల్లలతో స్పెషల్ స్కిట్.. ఎమోషనల్ అయిన నిహారిక..

తాజాగా డ్రామా జూనియర్స్ షోలో పవన్ కళ్యాణ్ జీవిత చరిత్రపై స్పెషల్ స్కిట్ వేశారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర పై ఆ షోలో పిల్లలతో స్పెషల్ స్కిట్.. ఎమోషనల్ అయిన నిహారిక..

Special Skit on Pawan Kalyan Life Story in Drama Juniors Show Promo goes Viral

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ లైఫ్ గురించి అందరికి తెలిసిందే. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. ఆ తర్వాత జనాల కోసం రాజకీయాల్లోకి వచ్చి ఓడిపోయినా ఓపికతో ఉండి ఇప్పుడు భారీ విజయం సాధించారు. ఇటీవల ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ భారీ గెలుపు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు.

పవన్ గెలుపుపై అభిమానులు, జనసేన కార్యకర్తలతో పాటు సినీ పరిశ్రమ కూడా ఫుల్ సంతోషంలో ఉంది. ఇప్పటికే అనేకమంది సినీ సెలబ్రిటీలు పవన్ ని అభినందించారు. తాజాగా డ్రామా జూనియర్స్ షోలో పవన్ కళ్యాణ్ జీవిత చరిత్రపై స్పెషల్ స్కిట్ వేశారు. చిన్న పిల్లలతో స్కిట్స్ వేయించే డ్రామా జూనియర్స్ షో నుంచి రాబోయే ఎపిసోడ్ కి చెందిన ప్రోమో విడుదల చేసారు. పవన్ కళ్యాణ్ పై పిల్లలు వేసిన స్కిట్ ని సపరేట్ ప్రోమోగా విడుదల చేసారు. దీంతో ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.

Also Read : Indra Movie : ఏలూరు ఇంద్ర సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఈ వైరల్ ప్రొడ్యూసర్‌ని గుర్తుపట్టారా? అప్పుడు పిల్లోడు..

ఈ స్కిట్ లో పవన్ సినిమాల్లోకి వచ్చింది, రాజకీయాల్లోకి వచ్చి మొదట ఓడిపోయి, ఆ తర్వాత గెలిచింది.. అన్ని చూపించారు. చిరంజీవి, నాగబాబు పాత్రలను కూడా చూపించారు. పవన్ కళ్యాణ్ స్పెషల్ స్కిట్ చూసి అక్కడున్న వాళ్లంతా ఎమోషనల్ అయ్యారు. ఈ షోకి గెస్ట్ గా వచ్చిన నిహారిక కూడా తన బాబాయ్ పై వేసిన ఈ స్పెషల్ స్కిట్ ని చూసి ఎమోషనల్ అయింది. ఫుల్ స్కిట్ కోసం, ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మీరు కూడా పవన్ కళ్యాణ్ స్కిట్ ప్రోమో చూసేయండి..