Thaman – Game Changer : ‘జరగండి.. జరగండి..’ సాంగ్‌లో అసలైన స్టెప్ రిలీజ్ చేయలేదు.. థియేటర్స్‌లో ఈ సాంగ్ రచ్చే.. తమన్ కామెంట్స్..

గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఆల్రెడీ 'జరగండి.. జరగండి..' లిరికల్ సాంగ్ విడుదల చేసారని తెలిసిందే.

Thaman – Game Changer : ‘జరగండి.. జరగండి..’ సాంగ్‌లో అసలైన స్టెప్ రిలీజ్ చేయలేదు.. థియేటర్స్‌లో ఈ సాంగ్ రచ్చే.. తమన్ కామెంట్స్..

Music Director Thaman Interesting Comments on Game Changer Jaragandi Jaragandi Song

Thaman – Game Changer : శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. గేమ్ ఛేంజర్ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20 విడుదల అవుతుందని ఇటీవల నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఆల్రెడీ ‘జరగండి.. జరగండి..’ లిరికల్ సాంగ్ విడుదల చేసారని తెలిసిందే.

‘జరగండి.. జరగండి..’ సాంగ్ మంచి మాస్ సాంగ్ గా బాగా వైరల్ అయింది. రామ్ చరణ్ – కియారా అద్వానీ పై కలర్ ఫుల్ గా భారీ ఖర్చుతోనే ఈ సాంగ్ తెరకెక్కించారు. ఈ సాంగ్ లో ఒక హుక్ స్టెప్ బాగా వైరల్ అయింది. అయితే తాజాగా తమన్ ఈ సాంగ్ గురించి మరో ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఆహలో వస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో తమన్ జడ్జిగా చేస్తున్నాడు. ఈ షోలో ఓ కంటెస్టెంట్ గేమ్ ఛేంజర్ నుంచి ‘జరగండి.. జరగండి..’ సాంగ్ పాడింది.

Also Read : Pranita Subhash : రెండో సారి ప్రగ్నెంట్ అయిన హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసి..

దీంతో ఈ పాట గురించి డిస్కషన్ రావడంతో తమన్ మాట్లాడుతూ.. ఈ పాట నుంచి అసలైన ఒరిజినల్ హుక్ స్టెప్ ఇంకా వదల్లేదు. ఈ సాంగ్ కి థియేటర్స్ లో రచ్చ రచ్చే మాములుగా ఉండదు అని అన్నారు. దీంతో చరణ్ అభిమానులు ఈ పాట విజువల్స్, చరణ్ స్టెప్స్ పై మరిన్ని అంచనాలు పెంచుకుంటున్నారు.