Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో పీవీ సింధు శుభారంభం.. మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో విజయం

రిస్ ఒలింపిక్స్ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన బ్యాడ్మింటన్ మహిళ సింగిల్స్ మ్యాచ్ లో పీవీ సింధు విజయం సాధించింది.

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో పీవీ సింధు శుభారంభం.. మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో విజయం

PV Sindhu

PV Sindhu : పారిస్ ఒలింపిక్స్ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన బ్యాడ్మింటన్ మహిళ సింగిల్స్ మ్యాచ్ లో పీవీ సింధు విజయం సాధించింది. మాల్దీవులకు చెందిన అబ్దల్ రజాక్ పై ఆమె విజయం సాధించింది. వరుస గేమ్స్ లో సింధు విజయం సాధించింది. కేవలం 29 నిమిషాల్లో సింధూ మ్యాచ్ ను ముగించింది.

సింధుకు రజాక్ ఏమాత్రం పోటీ ఇవ్వలేక పోయింది. తొలి సెట్‌ను 21-9 తేడాతో సింధు గెలుచుకుంది. దీంతో రెండో సెట్‌ను 21-6తో కైవసం చేసుకుంది. సింధు 2016 రియో ​​ఒలింపిక్స్‌, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించింది. తాజాగా పారిస్ ఒలింపిక్స్ లోనూ సింధూ పతకాలు సాధిస్తుందని క్రీడాభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

Also Read : Paris Olympic 2024 : ఒలింపిక్స్‌లో ఇవాళ భారత్‌కు రెండు కీలక ఈవెంట్లు.. పతకాల పంట పండేనా..? నేటి పూర్తి షెడ్యూల్ ఇలా

రోయింగ్ విభాగంలో భారత అథ్లెట్ బాల్ రాజ్ పన్వార్ సత్తాచాటాడు. తద్వారా క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నాడు. మొనాకో అథ్లెట్ క్వింటిన్ ఆంటోగ్నెల్లి తొలి స్థానం సాధించగా.. బాల్ రాజ్ రెండో స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లాడు.తన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ను మంగళవారం ఆడనున్నాడు.