మాజీమంత్రి పెద్దిరెడ్డి అనుచరుడి ఇంట్లో పోలీసుల సోదాలు

దాదాపు 8 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు ఏపీ పోలీసులు.

మాజీమంత్రి పెద్దిరెడ్డి అనుచరుడి ఇంట్లో పోలీసుల సోదాలు

Peddireddy Ramachandra Reddy : మదనపల్లి ఫైల్స్ దహనం ఘటనపై ఏపీ పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు శశికాంత్ ఇంట్లో ఏపీ పోలీసులు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కీలక ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిన్న రాత్రి నుంచి అయ్యప్ప సొసైటీలోని శశికాంత్ ఇంట్లో సోదాలు సాగాయి. దాదాపు 8 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు ఏపీ పోలీసులు.

శశికాంత్‌… పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు. అయ్యప్ప సొసైటీలోని ఆర్‌ అండ్‌ ఆర్‌ రెసిడెన్సీ ప్లాట్ నెంబర్ 501లోని శశికాంత్‌ ఇంట్లో సోదాలు చేశారు. సీఐ రమేష్‌ ఆధ్వర్యంలో శశికాంత్‌ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఇంట్లో శశికాంత్‌ నివాసం ఉంటున్నాడు. రైడ్స్ సమయంలో శశికాంత్‌ ఇంట్లో లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యేను పిలిచి తనిఖీలు చేశారు ఏపీ పోలీసులు. దాదాపు 8 గంటలపాటు సోదాలు నిర్వహించారు. శశికాంత్ ఇంట్లో భారీగా పైల్స్ గుర్తించారు. నాలుగు బాక్సుల్లో కీలక ఫైల్స్ ను తీసుకెళ్లారు ఏపీ పోలీసులు. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దగ్ధం కేసు సంచలనంగా మారింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. దీని వెనుకున్న వారిని వదిలే ప్రసక్తే లేదంటోంది.

మదనపల్లె ఫైల్స్ కేసు ఏపీలో రాజకీయ దుమారం రేపింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడి ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. శశికాంత్ ఇంట్లో సోదాల విషయాన్ని ఏపీలో పోలీసులు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. గతంలో పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు సంబంధించిన కీలక ఫైల్స్ ను శశికాంత్ తన ఇంట్లో భద్రపరుచుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. రెండు బాక్సుల్లో పెద్ద మొత్తంలో ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకెళ్లారు. శశికాంత్ అందుబాటులో లేకపోవడంతో అతడి కుటుంసభ్యులను ఆరా తీశారు పోలీసులు. ఐదు నుంచి ఆరుగురితో కూడిన ప్రత్యేక పోలీస్ బృందం శశికాంత్ ఇంట్లో తనిఖీలు చేసినట్లు సమాచారం.

Also Read : జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైఎస్ షర్మిల.. తక్షణమే రాజీనామా చేయాలంటూ డిమాండ్