Mokksha – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హవా బెంగాల్‌లో కూడా.. పవన్ గురించి ఈ బెంగాలీ హీరోయిన్ ఏం చెప్పిందంటే..

తాజాగా ఓ బెంగాలీ హీరోయిన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది.

Mokksha – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హవా బెంగాల్‌లో కూడా.. పవన్ గురించి ఈ బెంగాలీ హీరోయిన్ ఏం చెప్పిందంటే..

Bengali Actress Mokksha Interesting Comments on Pawan Kalyan

Mokksha – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలిసిందే. ఏ స్టార్ హీరోకి లేనంతమంది అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో ఆయన సొంతం. తన సినిమాలతో ఆల్రెడీ సౌత్ లో బాగా పాపులర్ పవన్. కానీ జనసేనతో దేశవ్యాప్తంగా కూడా పాపులర్ అయ్యారు. ఇటీవల ఏపీ ఎన్నికల్లో జనసేన 100 శాతం సక్సెస్ సాధించిన పార్టీగా నిలవడం, ప్రధాని మోడీ సైతం ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ని సునామి అంటూ పొగడటం, పవన్ పొలిటికల్ స్పీచ్ లు నార్త్ లో వైరల్ అవ్వడంతో నార్త్ లో కూడా పవన్ కి మంచి ఫేమ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ కి జనసేన విజయం తర్వాత దేశవ్యాప్తంగా అభినందనలు వచ్చాయి.

తాజాగా ఓ బెంగాలీ హీరోయిన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది. బెంగాల్ కి చెందిన నటి మోక్ష హీరోయిన్ గా తెలుగు, తమిళ్ లో సినిమాలు చేస్తుంది. బెంగాల్ నుంచి ఇక్కడ అవకాశాలు రావడంతో ఇక్కడికి షిఫ్ట్ అయింది ఈ భామ. మోక్ష హీరోయిన్ గా నటించిన అలనాటి రామచంద్రుడు సినిమా ఆగస్టు 2న రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా మోక్ష తాజాగా మీడియాతో మాట్లాడింది. మోక్షకు తెలుగు సినిమాలపై మంచి నాలెడ్జ్ ఉంది. తెలుగు సినిమాలు డబ్బింగ్ లో బెంగాల్ లో చూశానని తెలిపింది. సావిత్రి, సాయి పల్లవి, రష్మిక అంటే ఇష్టమని తెలిపింది. పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడింది మోక్ష.

Also Read : Kya Lafda Lyrical : రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి రొమాంటిక్ సాంగ్ వ‌చ్చేసింది..

మోక్ష మాట్లాడుతూ.. పవన కళ్యాణ్ గారు చాలా గ్రేట్ పర్సన్. దేశం మొత్తం ఇప్పుడు ఆయన తెలుసు. ఆయన సినిమాలు డబ్బింగ్ లో చూసాము. తెలుగు సినిమాలు, తెలుగు వాళ్ళు ఇప్పుడు ఇండియా అంతా వినిపిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు మంచి సక్సెస్ సాధించి దేశంలో అందరూ మాట్లాడుకునేలా చేసారు అని తెలిపింది. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా సినిమాలతో పాన్ ఇండియాకు వెళ్లకపోయినా జనసేన సక్సెస్ తో పవన్ దేశం మొత్తం తెలిసేలా చేసాడు అని అభిమానులు, జనసేన కార్యకర్తలు సంతోషిస్తున్నారు.