బైక్‌తో సహా వాగులో కొట్టుకుపోయిన యువకులు.. చివరికి..

తాడేపల్లిగూడెం మండలంలో మాధవరం నుంచి కంసాలిపాలెం వైపు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

బైక్‌తో సహా వాగులో కొట్టుకుపోయిన యువకులు.. చివరికి..

East Godavari District Floods : పశ్చిమ గోదావరి జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. వాగు ఉధృతికి బైక్ అదుపు తప్పింది. వాగు దాటే క్రమంలో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని రక్షించారు. బైక్ తో సహా ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తాడేపల్లిగూడెం మండలంలో మాధవరం నుంచి కంసాలిపాలెం వైపు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల వరదలు పోటెత్తాయి. ఊళ్లకు ఊళ్లు నీట మునిగాయి. ప్రజలు సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. కొన్ని చోట్ల వాగులు, వంకల్లో వరద ఉధృతి ఎక్కువగా ఉంది. అయితే, మరో దారి లేకపోవడంతో ప్రజలు ఆ వాగుల మీదుగానే ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో వారి ప్రాణాలను పణంగా పెట్టాల్సి పరిస్థితి. వాగును దాటే సమయంలో ప్రమాదవశాత్తు వరద నీటిలో కొట్టుకుపోతున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. వాగు ఉధృతిని అంచనా వేయలేకపోయిన ఇద్దరు యువకులు బైక్ పై వాగును దాటే ప్రయత్నం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. బైక్ తో సహా వారు వాగులో కొట్టుకుపోయారు. అదృష్టవశాత్తు స్థానికులు వెంటనే స్పందించి వారిని కాపాడారు. లేదంటే ఘోరం జరిగిపోయి ఉండేది. వాగులు, వంకలు పారతున్న చోట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటిని దాటే ప్రయత్నం చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.

Also Read : కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం.. గుర్రపు స్వారీ చేస్తూ యువకుడు దుర్మరణం