అసెంబ్లీలో గొంతు పెంచుకుంటే అబద్ధాలు నిజాలవుతాయా?- సీఎం రేవంత్ పై హరీశ్ రావు ఫైర్

18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ కు ఒక్క సీటు రాలేదు. కాంగ్రెస్ పని అయిపోయిందా? వరుసగా మూడోసారి కాంగ్రెస్ ఓడింది. రెండు సార్లు మా చేతిలో ఓడిపోయారు. మీ పని అయిపోయిందా?

అసెంబ్లీలో గొంతు పెంచుకుంటే అబద్ధాలు నిజాలవుతాయా?- సీఎం రేవంత్ పై హరీశ్ రావు ఫైర్

Harish Rao : సీఎం రేవంత్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ”మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నేరుగా పంపింగ్ చేయడం సాధ్యం కాదని చెప్పారు. నిన్న కూడా అదే విధంగా కొన్ని పదాలు చదవకుండా వదిలేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఇలా వ్యవహరించొచ్చా? సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తాము. మేము ఒప్పందం చేసుకుంటే మీటర్లు ఎక్కడైనా పెట్టామా? ఆంధ్రకు నీళ్లు ఇచ్చేందుకు పులిచింతల ప్రాజెక్టు కట్టించారు. 5 జులై 2005 నాడు తెలంగాణ ప్రయోజనాల కోసం మంత్రి పదవులు వదులుకున్నాం. 17 జులైన రాజీనామాలు ఆమోదించారు. 19.12.2005 నాడు పోతిరెడ్డిపాడు జీవో ఇచ్చారు. ప్రతి సెషన్ లో సీఎం ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. పదవుల కోసం పెదవులు ఎవరు మూసుకున్నారో ప్రజలకు తెలుసు.

ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతలు ఉచితంగా చేస్తామని హైకోర్టులో అఫిడవిట్ వేశారు. మంత్రివర్గంలో మాత్రం క్రమబద్దీకరణకు డబ్బులు వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కోర్టులో కేసు ఉపసంహరించుకుంటామని అంటున్నారు. నేను ఉద్యమకారుడిని అని చెప్పుకునే యత్నం సీఎం రేవంత్ చేస్తున్నారు. ఆనాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రాజీనామా చేయలేదు. సోనియాని బలి దేవత అనలేదా? ఉద్యమకారులపై తుపాకీ పెట్టలేదా? అప్పుడు నిన్ను రైఫైల్ రెడ్డి అనలేదా? ఒక్కరోజు తెలంగాణ కోసం మాట్లాడలేదు. బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపిన తర్వాత రేవంత్ మాట్లాడారు. అసెంబ్లీ లో గొంతు పెంచుకుంటే అబద్ధాలు నిజాలు అవుతాయా?

18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ కు ఒక్క సీటు రాలేదు. కాంగ్రెస్ పని అయిపోయిందా? వరుసగా మూడోసారి కాంగ్రెస్ ఓడింది. రెండు సార్లు మా చేతిలో ఓడిపోయారు. మీ పని అయిపోయిందా? 28 పార్టీల పొత్తుతో 99 సీట్లు మీకు వచ్చాయి. 1984 తర్వాత కాంగ్రెస్.. సొంతగా అధికారంలోకి రాలేదు” అని చిట్ చాట్ లో హరీశ్ రావు అన్నారు.

Also Read : బీఆర్ఎస్ నేతలపై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఆగ్రహం