Manu Bhaker : మ‌ను భాక‌ర్‌పై రూ.2 కోట్లు ఖ‌ర్చు చేశాం.. త‌గిన ఫ‌లితం దక్కిందన్న కేంద్ర మంత్రి

పారిస్ ఒలింపిక్స్ 2024లో భార‌త్‌కు తొలి ప‌త‌కాన్ని అందించింది షూట‌ర్ మ‌ను భాక‌ర్‌.

Manu Bhaker : మ‌ను భాక‌ర్‌పై రూ.2 కోట్లు ఖ‌ర్చు చేశాం.. త‌గిన ఫ‌లితం దక్కిందన్న కేంద్ర మంత్రి

Manu Bhaker

పారిస్ ఒలింపిక్స్ 2024లో భార‌త్‌కు తొలి ప‌త‌కాన్ని అందించింది షూట‌ర్ మ‌ను భాక‌ర్‌. ప్ర‌స్తుతం ఆమెపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ సైతం ఆమెను అభినందించారు. అదే స‌మ‌యంలో ఆమె శిక్ష‌ణ కోసం కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేసిన‌ట్లుగా చెప్పుకొచ్చారు. మ‌ను భాక‌ర్ క‌ఠిన శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితం ద‌క్కింద‌న్నారు.

ఆదివారం జ‌రిగిన మ‌హిళ‌ల ఎయిర్ పిస్ట‌ల్ ఈవెంట్ ఫైన‌ల్‌లో 22 ఏళ్ల మ‌ను భాక‌ర్ మూడో స్థానంలో నిలిచి కాంస్య ప‌త‌కాన్ని సొంతం చేసుకుంది. ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. ఆమె విజ‌యం అనంత‌రం కేంద్ర క్రీడా మంత్రి మాండ‌వ్య ఏఎన్ఐతో మాట్లాడారు. పారిస్ ఒలింపిక్స్‌లో మొద‌టి కాంస్య ప‌త‌కాన్ని గెలుచుకోవ‌డం ద్వారా మ‌ను భాక‌ర్ భార‌త‌దేశం గ‌ర్వ‌ప‌డేలా చేసింద‌న్నారు.

Also Read : గోల్డెన్ ఛాన్స్‌ను మిస్ చేసుకున్న సంజూ శాంస‌న్‌.. మ‌ళ్లీ డ‌గౌట్‌లో కూర్చోవాల్సిందేనా..?

‘ఖేలో ఇండియా’లో మనూ భాకర్‌ భాగమైందని, ఆమె శిక్షణ కోసం 2 కోట్ల‌ రూపాయలను ఖ‌ర్చు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ట్రైయినింగ్ కోసం ఆమెను జ‌ర్మ‌నీ, స్విట్జ‌ర్లాండ్‌కు పంపించిన‌ట్లు తెలిపారు. ఆమె కోరుకున్న కోచ్‌ను నియ‌మించిన‌ట్లు తెలిపారు. శిక్ష‌ణ‌కు కావాల్సిన ఆర్థిక సాయం అందించిన‌ట్లు చెప్పారు.

మన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా శిక్షణ ఇప్పిస్తున్నామ‌ని కేంద్ర మంతి అన్నారు. ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో మన వాళ్లు సత్తా చాటుతారని నమ్మకం ఉందన్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొన్న‌ అథ్లెట్లకు మన్సుఖ్‌ మాండవీయ ఆల్ ది బెస్టు చెప్పారు.

Also Read: బాల్ ఆప‌క‌పోయినా బాగుండేది గ‌దా.. ఇప్పుడు చూడు.. కష్ట‌ప‌డి బౌండ‌రీ ఆపిన ఫీల్డ‌ర్‌ పై..