కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం.. గుర్రపు స్వారీ చేస్తూ యువకుడు దుర్మరణం

యువకుడి మరణంతో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం.. గుర్రపు స్వారీ చేస్తూ యువకుడు దుర్మరణం

Horse Ride Death : కర్నూలు జిల్లా మద్దికేర మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుర్రపు స్వారీ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. గుర్రానికి శిక్షణ ఇచ్చే క్రమంలో గుర్రంపై స్వారీ చేస్తూ పృథ్వీరాజ్ రోడ్డుపై పడిపోయాడు. అతడి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు మరణించాడని డాక్టర్లు చెప్పారు. పృథ్వీరాజ్ పూర్వీకులు ఆనవాయితీగా దసరా పండుగకు గుర్రపు స్వారీలు చేసే వారని స్థానికులు తెలిపారు. దసరా గుర్రాల స్వారీ కోసం గుర్రానికి శిక్షణ ఇస్తుండగా ప్రమాదవశాత్తు పృథ్వీరాజ్ అకాల మరణం చెందాడు. యువకుడి మరణంతో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

దసరా పండుగ సందర్భంగా గుర్రపు స్వారీలో పాల్గొంటారు. ఈ క్రమంలో గుర్రానికి ట్రైనింగ్ ఇస్తుండగా ఘోరం జరిగిపోయింది. గుర్రానికి శిక్షణ ఇస్తున్న సమయంలో యువకుడు అకాల మరణం చెందాడు. పృథ్వీరాజ్ గుర్రంపై స్వారీ చేస్తున్నాడు. అతడి వెనకాల కొందరు బైక్స్ పై ఫాలో అవుతున్నారు. గుర్రపు స్వారీని వారు తమ ఫోన్ లో రికార్డ్ చేస్తున్నారు. అదే సమయంలో గట్టి గట్టిగా కేకలు వేస్తున్నారు. అయితే, గట్టిగా అరవొద్దని, గుర్రం భయపడుతుందని పృథ్వీరాజ్ పదే పదే చెప్పాడు. ఇంతలోనే అతడు పట్టుతప్పి గుర్రం మీద నుంచి రోడ్డు మీద పడ్డాడు. ఆ మరుక్షణమే తీవ్ర గాయాలతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.

పృథ్వీరాజ్ గుర్రపు స్వారీ చేస్తూ దానిపై నుంచి రోడ్డు మీద పడిపోవడం.. ఇదంతా వీడియోలో రికార్డ్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకే అవగాహన, అనుభవం లేకుండా ఏ పని చేయకూడదని చెబుతారు. లేదంటే ఇదిగో ఇలా ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Also Read : రియల్ లైఫ్ ‘గజినీ’? ముంబై హిస్టరీ-షీటర్ దారుణహత్య.. శత్రువుల పేర్లను టాటూగా వేయించుకున్నాడు!