Zomato Veg Meal : వెజ్ మీల్‌ ఆర్డర్ చేస్తే.. చికెన్ ముక్క ప్రత్యక్షం.. కస్టమర్ ఫిర్యాదుతో జొమాటో క్షమాపణలు..!

Zomato Veg Meal : కస్టమర్ ఫిర్యాదుపై స్పందించిన జొమాటో వెంటనే క్షమాపణ చెప్పింది. ఫుడ్-డెలివరీ ప్లాట్‌ఫారమ్ కూడా కస్టమర్‌కు ఎదురైన సమస్యను చెక్ చేసి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.

Zomato Veg Meal : వెజ్ మీల్‌ ఆర్డర్ చేస్తే.. చికెన్ ముక్క ప్రత్యక్షం.. కస్టమర్ ఫిర్యాదుతో జొమాటో క్షమాపణలు..!

X User Finds Chicken In Veg Meal Ordered From Zomato ( Image Source : Google )

Zomato Veg Meal : ప్రస్తుతం రోజుల్లో ఫుడ్ ఆర్డర్ అప్లికేషన్ల వినియోగం గణనీయంగా పెరిగింది. చాలామంది ఇంట్లో ఫుడ్ కన్నా ఆర్డర్ చేసిన ఫుడ్ తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. డిమాండ్‌కు తగినట్టుగా ఫుడ్ డెలివరీ కంపెనీలు కూడా కస్టమర్ కోరుకున్న భోజనాన్ని ఇంటికి డెలివరీ చేస్తున్నాయి. అందులో జొమాటో ఒకటి.. జీవితాలు వేగంగా మారడంతో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ ద్వారా సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు.

Read Also : Zomato Delivery Boy : ఉండేది ముంబై మురికివాడలో.. నెలకు అద్దె రూ. 500.. జొమాటో డెలివరీ బాయ్ రియల్ లైఫ్ స్టోరీ..!

అయినప్పటికీ, నాణ్యత, డెలివరీ ఆలస్యం, తప్పుగా డెలివరీ చేయడం వంటి అనేక ఘటనలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు, అలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్‌ బదులుగా మరో ఫుడ్ డెలివరీ చేయడం కస్టమర్లలో ఆందోళన రేకెత్తించింది. యూజర్ హిమాన్షి తను జొమాటో ద్వారా ఆర్డర్ చేసిన వెజ్ వంటకంలో చికెన్ దొరికిందని ఫిర్యాదు చేశాడు.

“ఈట్‌ఫిట్ నుంచి పాలక్ పనీర్ సోయామాటర్, మిల్లెట్ పులావ్ త్రూ జొమాటోని ఆర్డర్ చేసాను. పాలక్ పనీర్‌కు బదులుగా వారు చికెన్ పాలక్‌ని అందించారు. నేను శాకాహారాన్ని మాత్రమే ఎంచుకున్నప్పుడు సావన్‌లో చికెన్ డెలివరీ చేయడం ఆమోదయోగ్యం కాదు” అని ఫోటోను షేర్ చేస్తూ ఎక్స్ యూజర్ పోస్టు చేశాడు.

కస్టమర్ ఫిర్యాదుపై స్పందించిన జొమాటో వెంటనే క్షమాపణ చెప్పింది. ఫుడ్-డెలివరీ ప్లాట్‌ఫారమ్ కూడా కస్టమర్‌కు ఎదురైన సమస్యను చెక్ చేసి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. “మీకు ఫుడ్ తప్పుగా డెలివరీ అయిందని గమనించాం. మీకు ఎంత బాధ కలిగించిందో అర్థం చేసుకున్నాం.

ఫుడ్ డెలివరీ.. రెస్టారెంట్ క్షమాపణలు :
మీ ఆహార ప్రాధాన్యతలను చాలా సీరియస్‌గా తీసుకుంటాం. మిమ్మల్ని ఎప్పటికీ అగౌరవపరచాలని అనుకోం. దయచేసి ఫుడ్ డెలివరీని చెక్ చేయడానికి మాకు కొంత సమయం ఇవ్వండి. వీలైనంత త్వరగా అప్‌డేట్‌తో తిరిగి వస్తాం” అని జొమాటో బదులిచ్చింది. ఈ ఘటనపై రెస్టారెంట్ కూడా క్షమాపణలు కూడా చెప్పింది. “ఇలాంటి చేదు అనుభవానికి చింతిస్తున్నాం. వెంటనే దీనిపై పరిష్కారాన్ని అందిస్తాం. దయచేసి మీ ఆర్డర్, కాంటాక్టు వివరాలను మెసేజ్ చేయండి” అని రెస్టారెంట్ పేర్కొంది.

అయితే, ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలో పూణే కస్టమర్ తాను జొమాటో నుంచి ఆర్డర్ చేసిన ఫుడ్ రెసిపీ గురించి ఫిర్యాదును ట్విట్టర్ వేదికగా పోస్టు చేశాడు. పూణేలోని కార్వే నగర్‌లోని పీకే బిర్యానీ హౌస్‌లో ఆర్డర్ చేసిన పనీర్ బిర్యానీలో చికెన్ ముక్క దొరికిందని ఆ వ్యక్తి పోస్ట్‌లో పేర్కొన్నాడు.

వెంటనే తాను వాపసు పొందినట్టు పేర్కొన్నాడు. అయితే, తాను శాఖాహారిని కావడంతో ఈ ఘటన తన సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీసిందని వాపోయాడు. బాధితుడి ఫిర్యాదుపై జొమాటో రిప్లయ్ ఇచ్చింది. “హాయ్ పంకజ్.. మేము ఎవరి మనోభావాలతోనూ ఎప్పుడూ రాజీపడకుండా చూసుకోవడమే మా అత్యంత ప్రాధాన్యత. దయచేసి మీ ఆర్డర్ ఐడీ లేదా రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌ను డీఎమ్ ద్వారా షేర్ చేయండి. తద్వారా మీ ఆర్డర్ మళ్లీ చెక్ చేస్తామని జొమాటో పేర్కొంది.

Read Also : Viral Video : నువ్వు సూపర్ అక్కా.. పామును మహిళ ధైర్యంగా ఎలా చేతులతో పట్టుకుందో చూశారా? వీడియో వైరల్!