Viraaji : ‘విరాజి’ మూవీ రివ్యూ.. థ్రిల్లింగ్ సినిమాతో వరుణ్ సందేశ్..

వరుణ్ సందేశ్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు చేస్తున్నాడు.

Viraaji : ‘విరాజి’ మూవీ రివ్యూ.. థ్రిల్లింగ్ సినిమాతో వరుణ్ సందేశ్..

Varun Sandesh Viraaji Movie Review and Rating

Viraaji Movie Review : వరుణ్ సందేశ్ మెయిన్ లీడ్ లో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘విరాజి’. మహా మూవీస్, M3 మీడియా బ్యానర్స్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాణంలో తెరకెక్కిన విరాజి సినిమా నేడు ఆగస్టు 2న థియేటర్స్ లో రిలీజ్ అయింది. విరాజి సినిమాలో అపర్ణ దేవి, కుశాలిని, వైవా రాఘవ, ప్రమోదిని, రఘు, యూట్యూబర్ రవితేజ, బలగం జయరాం.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

కథ విషయానికొస్తే.. ఒక సినిమా నిర్మాత, ఒక లేడి స్టాండప్ కమెడియన్, ఒక ఫోటోగ్రాఫర్, ఒక లేడి డాక్టర్, ఒక పోలీస్, ఒక భార్యాభర్తల జంట, ఒక ఆస్ట్రాలజర్ స్వామి, ఒక ఈవెంట్ మేనేజర్.. ఇలా తొమ్మిది మందికి వేరు వేరు కారణాలతో పిలుపు రావడంతో అందరూ కలిసి ఊరికి దూరంగా ఉన్న ఒక పాత బిల్డింగ్ కి వస్తారు. అది ఒకప్పుడు పిచ్చాసుపత్రిగా ఉండి ఇప్పుడు ఖాళీగా ఉంటుంది. అక్కడ ఈవెంట్ జరుగుతుందని వీళ్లల్లో కొంతమందిని పిలిచినట్టు చెప్తారు. అక్కడ ఒక పేపర్ లో వీళ్ళ పేర్లు రాసి వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరి చావుకు కారణం అయ్యారని, వీళ్ళందరికీ శిక్ష పడుతుందని రాసి ఉంటుంది. వెళ్లిపోదామనుకోగా బయట వీళ్ళు వచ్చిన కార్లు కూడా మాయం అవుతాయి. దీంతో అందరూ భయపడతారు.

ముగ్గురు మాత్రం నడిచి వెళ్ళిపోదామని బయటకి వెళతారు. అదే సమయంలో యాండీ(వరుణ్ సందేశ్) అక్కడికి వస్తాడు. లిస్ట్ లో తన పేరు కూడా ఉంటుంది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. అసలు వీళ్లంతా ఎవరు? వీళ్ళు ఆ పాత బిల్డింగ్ కి ఎందుకొచ్చారు? వీళ్ళందరికీ ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు చనిపోతున్నారు? యాండీ ఎవరు? ఇదంతా ఎవరు, ఎందుకు చేస్తున్నారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Devara : ఎన్టీఆర్ ‘దేవ‌ర’ నుంచి సూప‌ర్ అప్‌డేట్‌.. రొమాంటిక్ సాంగ్‌కు డేట్ ఫిక్స్‌..

సినిమా విశ్లేషణ.. సినిమా చూస్తే ఇలాంటి లైన్ తో గతంలో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. అయితే ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్స్ అందరూ రావడం, ఆ లొకేషన్ ని హారర్ ఫీల్ తో చూపించడంతో కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. చాలా తొందరగా ఇంటర్వెల్ వస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలవుతుంది. వీళ్ళు ఎలా వచ్చారు, అసలు ఎవరు? ఎందుకు వచ్చారు అని చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.

ప్రీ క్లైమాక్స్ నుంచి చాలా ఆసక్తిగా సాగుతుంది. లాస్ట్ లో వచ్చే రెండు మూడు ట్విస్ట్ లు ప్రేక్షకులని మెప్పిస్తాయి. క్యారెక్టర్స్ అన్ని కలిసి ప్రీ క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ బాగుంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా వావ్ అనిపించినా ఇదంతా జరిగేది ఇందుకేనా అని కొంతమందికి అనిపించొచ్చు. ఒక నార్మల్ పాయింట్ ని చాలా కొత్తగా థ్రిల్లింగ్, హారర్ ఎలిమెంట్స్ తో చెప్పారు. హారర్ ఎలిమెంట్స్ కేవలం ప్రేక్షకులని భయపెట్టడానికి మాత్రమే వాడుకున్నారు. ఈ సినిమా రన్ టైం రెండు గంటల కంటే తక్కువ అవ్వడంతో సినిమాకి చాలా ప్లస్ అవుతుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్.. వరుణ్ సందేశ్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో పోష్ క్యారెక్టర్ లో, కొత్త గెటప్ లో వరుణ్ సందేశ్ అదరగొట్టాడని చెప్పొచ్చు. ప్రమోదిని ఎమోషనల్ సీన్స్ తో మెప్పిస్తుంది. అపర్ణ దేవి, కుశాలిని, వివా రాఘవ, రఘు, యూట్యూబర్ రవితేజ, ఫణి ఆచార్య, కాకినాడ నాని, బలగం జయరాం.. ఇలా ఆర్టిస్టులు అంతా ఆ కథకు, సన్నివేశాలకు తగ్గట్టు చాలా బాగా నటించారు.

సాంకేతిక అంశాలు.. సినిమా చాలా వరకు రాత్రి పూటే తీశారు. దానికి తగ్గట్టు సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగా వచ్చాయి. ఇక సినిమా ఆల్మోస్ట్ ఒకే లొకేషన్ లో తీశారు. ఆర్ట్ డైరెక్టర్ ఆ లొకేషన్ కోసం బాగా వర్క్ చేసారు. ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఒక మాములు కథని ఇలా హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో చెప్పడంతో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇది డైరెక్టర్ కి ఫస్ట్ సినిమా అయినా అలా అనిపించదు. నిర్మాణ పరంగా కూడా తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రేక్షకులని భయపెడతారు.

మొత్తంగా విరాజి సినిమా కొంతమంది ఒక పాడుబడ్డ బంగ్లాకు ఎందుకొచ్చారు, వచ్చాక ఏం జరిగింది అని ఓ పాత కథని కొత్తగా హారర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో చాలా బాగా చూపించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.