Nagababu : మాట నిలబెట్టుకున్న మెగా బ్రదర్.. వాళ్ళ కోసం సాయం..

మెగా బ్రదర్ నాగబాబు గతంలో ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో సేవలందిస్తూ మరణించిన వారి కుటుంబాలకు తన వంతు ఆర్ధిక సహాయం చేస్తానని ప్రకటించారు.

Nagababu : మాట నిలబెట్టుకున్న మెగా బ్రదర్.. వాళ్ళ కోసం సాయం..

Mega Brother Nagababu Helped to Air Force Soldiers Families

Nagababu : మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటూ జనసేన ప్రధాన కార్యదర్శిగా పార్టీ పనులు చూసుకుంటూ బిజీగా ఉన్నారు. మెగా ఫ్యామిలీ ఇచ్చిన మాట తప్పదు, అందులోను ఎవరికైనా సహాయం చేస్తానని చెప్తే మర్చిపోకుండా చేస్తారు అని అందరూ అంటారు. దానికి తగ్గట్టు వాళ్ళు కూడా అది చేసి చూపిస్తారు.

మెగా బ్రదర్ నాగబాబు గతంలో ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో సేవలందిస్తూ మరణించిన వారి కుటుంబాలకు తన వంతు ఆర్ధిక సహాయం చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు ఆ మాటని నెరవేర్చారు నాగబాబు. తాజాగా తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Also Read : Wayanad landslides : లెఫ్టినెంట్ కల్నల్‌ హోదాలో వయనాడ్‌ సహాయక చర్యల్లో మోహన్‌లాల్‌..

ఆపరేషన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగబాబు మాట్లాడిన వీడియోని, తాను డొనేట్ చేసిన డబ్బు ప్రూఫ్ ని షేర్ చేస్తూ.. ఆపరేషన్ వాలంటైన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎయిర్ ఫోర్స్ లో సేవలందిస్తూ ప్రాణాలర్పించిన వారి కుటుంబాలకి నా వంతు సాయం చేస్తానని మాటిచ్చాను. ఇచ్చిన మాటకి గాను వారికి నేను 6 లక్షల రూపాయల సహకారం అందించాను. ఈ చిన్న సాయం పెద్ద గొప్పది కాకపోవచ్చు కాని ఇచ్చిన మాట మర్చిపోలేదన్న విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. దేశ సేవలో ప్రాణాలర్పించిన వారికి తోడ్పాటు అందించే అవకాశం రావడం చాలా అదృష్టంగా ఉందని తెలియజేయడానికి అని పోస్ట్ చేసారు. దీంతో మెగా బ్రదర్ నాగబాబుని మరోసారి అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు.