Mathias Boe : ఒలంపిక్స్ బ్యాడ్మింటన్‌లో ఇండియా ఓటమి.. రిటైర్మెంట్ ప్రకటించిన తాప్సీ భర్త..

ఇండియా తరపున బ్యాడ్మింటన్ డబుల్స్ లో ఆడిన సాత్విక్ సాయిరామ్- చిరాగ్ శెట్టి క్వార్ట‌ర్స్ వరకు వెళ్లి ఓటమి పాలయ్యారు.

Mathias Boe : ఒలంపిక్స్ బ్యాడ్మింటన్‌లో ఇండియా ఓటమి.. రిటైర్మెంట్ ప్రకటించిన తాప్సీ భర్త..

Satwik Sairaj Chirag Shetty Loss in Olympics Taapsee Pannu Husband Mathias Boe Announced Retirement

Taapsee Pannu Husband Mathias Boe : ప్రస్తుతం పారిస్ లో ఒలంపిక్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఇండియాకు కేవలం మూడు పతకాలు మాత్రమే వచ్చాయి. ఇప్పటికే పలువురు ఇండియన్ అథ్లెట్స్ ఓటమి పాలవ్వగా తాజాగా ఇండియా తరపున బ్యాడ్మింటన్ డబుల్స్ లో ఆడిన సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి క్వార్ట‌ర్స్ వరకు వెళ్లి ఓటమి పాలయ్యారు. ఈసారి పతకం తీసుకొస్తారు అనుకున్న ఈ జంట క్వార్ట‌ర్స్ లో ఓడిపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు.

అయితే వీళ్లిద్దరికీ కోచింగ్ ఇచ్చింది ఎవరో కాదు తాప్సీ భర్త మథియాస్ బో. మథియాస్ బో 2012 ఒలంపిక్స్ బ్యాడ్మింటన్ లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఆటకు రిటైర్మెంట్ ఇచ్చి కోచ్ గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి తాప్సీ భ‌ర్త బ్యాడ్మింట‌న్ కోచ్ మథియాస్ బో దగ్గరే శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పుడు వీరు ఓడిపోవడంతో మథియాస్ బో కోచింగ్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసాడు.

Also Read : ఒలింపిక్స్‌లో ఇవాళ కీలక ఈవెంట్లు.. లక్ష్యసేన్ వైపు భారత్ చూపు.. 100 మీటర్ల పరుగులో విజేత ఎవరో?

మథియాస్ బో తన సోషల్ మీడియాలో.. మీరిద్దరూ ప్రతి మ్యాచ్ బాగా ఆడారు. నన్ను గర్వపడేలా చేసారు. ఇండియాలో ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి. కోచ్ గా నా ప్రయాణం ముగిసింది. ఇకపై ఇంకెక్కడా కోచ్ గా చేయను. ఇప్పటికే బ్యాడ్మింటన్ కోసం చాలా టైం ఇచ్చాను. కోచింగ్ చేస్తే చాలా ఒత్తిడి ఎదుర్కోవాలి. కానీ నేను అలిసిపోయిన ఓ ముసలివాడిని. మీరు కష్టపడతారు, పతకంతో ఇండియాకు వెళ్ళాలి అనుకున్నారు. దాని కోసం చాలా కష్టపడ్డారు. కానీ కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగవు. నిరాశ చెందకుండా మళ్ళీ ప్రయత్నించాలి అని ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. దీంతో మథియాస్ బోని అంతా అభినందిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Mathias Boe (@mathias.boe)

ఇక మథియాస్ బో చేసిన పోస్ట్ కి తాప్సీ కామెంట్ లో.. నీకు పెళ్లి అయింది. ఇక నువ్వు రెస్ట్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది. రోజూ నేను వర్క్ నుంచి రాగానే నీకు డిన్నర్ చేసి పెడతాను అని పోస్ట్ చేసింది.