జనసేనలోకి విశాఖ వైసీపీ కార్పొరేటర్లు.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

పర్యావరణశాఖ మంత్రిగా కాలుష్య నియంత్రణ మండలి నా పరిధిలోనే ఉంది. ఎక్కడైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి.

జనసేనలోకి విశాఖ వైసీపీ కార్పొరేటర్లు.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Deputy CM Pawan Kalyan : విశాఖ వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరారు. వారిని పార్టీలోకి ఆహ్వానించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్. చేరికల సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత మొట్టమొదటి రాజకీయపరమైన చేరికలు ఇవి అని ఆయన అన్నారు. నాకు ఎంతో ఇష్టమైన విశాఖ నుంచి పార్టీలోకి చేరికలు మొదలు కావడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని పవన్ స్పష్టం చేశారు.

”పార్టీలో కొత్తగా చేరిన నాయకులంతా రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నా. పార్టీ కోసం కష్టపడిన జన సైనికులు, వీర మహిళలతో మమేకమై ముందుకు వెళ్లాలి. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి తరఫున బలంగా విజయం సాధించే విధంగా అంతా కృషి చేయాలి. విశాఖలో పొల్యూషన్ ఆడిట్ నిర్వహిస్తాం. విశాఖలో కాలుష్యం సమస్య చాలా ఎక్కువగా ఉంది. దేశంలోనే వాయు, జల కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరంగా ఉంది. కార్పొరేటర్లుగా మీ అందరిపై కాలుష్య నియంత్రణ బాధ్యత ఉంది. పర్యావరణశాఖ మంత్రిగా కాలుష్య నియంత్రణ మండలి నా పరిధిలోనే ఉంది. ఎక్కడైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి. విశాఖలో పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. విశాఖలో రియల్ ఎస్టేట్ సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి” అని పవన్ కల్యాణ్ అన్నారు.

Also Read : ఆ ఒక్కడి కోసం స్పెషల్‌ ఆపరేషన్, నీడలా వెంటాడుతున్న పోలీసులు.. అసలు వల్లభనేని వంశీ ఎక్కడ?