Saina Nehwal : వినేశ్ ఫోగ‌ట్ అన‌ర్హ‌త పై సైనా నెహ్వాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఆ ఇద్దరే చెప్పాలి..

పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త స్టార్ రెజ్ల‌ర్ వినేశ్ ఫోగట్ పై అన‌ర్హ‌త వేటు ప‌డింది.

Saina Nehwal : వినేశ్ ఫోగ‌ట్ అన‌ర్హ‌త పై సైనా నెహ్వాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఆ ఇద్దరే చెప్పాలి..

Saina Nehwal On Wrestler Vinesh Phogat Olympic Disqualification

Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త స్టార్ రెజ్ల‌ర్ వినేశ్ ఫోగట్ పై అన‌ర్హ‌త వేటు ప‌డింది. దీంతో ప‌త‌కం సాధించాల‌న్న ఆమె ఆశ‌లు అన్ని అడియాశ‌లు అయ్యాయి. ఒలింపిక్స్ చ‌రిత్ర‌లో ఫైన‌ల్ చేరుకున్న తొలి భార‌త మ‌హిళా రెజ్ల‌ర్‌గా వినేశ్ చ‌రిత్ర సృష్టించింది. స్వ‌ర్ణం లేదా ర‌జ‌తం రెండింటిలో ఏదో ఒక‌టి ఆమెకు త‌ప్ప‌క వ‌స్తుంద‌ని యావ‌త్ భార‌త‌దేశం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుండ‌గా ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు ఆమె డిస్ క్వాలిఫై అయిన‌ట్లుగా తెలియ‌డంతో అభిమానులంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యారు. 100 గ్రాముల అధిక బ‌రువు కార‌ణంగా ఆమె పై అన‌ర్హ‌త వేటు ప‌డింది.

దీనిపై ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ స్పందించింది. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. దేశం నిరుత్సాహానికి గురైందని అంది. రెండు మూడు రోజులుగా ఆమె ప‌త‌కం సాధిస్తుంద‌ని ఎంతో ఉత్సాహంగా ఉన్న‌ట్లు తెలిపింది. ఒలింపిక్స్‌లో ప‌త‌కం సాధించే క్ష‌ణం కోసం ప్ర‌తి క్రీడాకారిణి శిక్ష‌ణ పొందుతుంద‌ని, ఆ స‌మ‌యంలో ఎలాంటి అనుభూతి ఉంటుందో త‌న‌కు తెలుసంది. ఓ అథ్లెట్‌గా దీన్ని వ‌ర్ణించ‌డానికి త‌న‌కు మాట‌లు రావ‌డం లేద‌ని సైనా అంది. వినేశ్ ఓ ఫైట‌ర్ అని, వ‌చ్చేసారి ఖ‌చ్చితంగా ఆమె దేశానికి ప‌త‌కం తీసుకువ‌స్తుంద‌నే ఆశాభావాన్ని వ్య‌క్తం చేసింది.

Vinesh Phogat : 140 కోట్ల ప్రజల హృదయాల్లో ఫొగట్‌ ఛాంపియన్ : రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము

‘ఆమె అనుభవజ్ఞుడైన క్రీడాకారిణి. ఆమెకు ఏది ఒప్పో, తప్పుదో తెలుసు. రెజ్లింగ్ సంబంధించి నాకు అంత‌గా తెలియ‌దు. ఫ‌లితం గురించి భార‌త ఒలింపిక్స్ కమిటీ అప్పీల్ చేసిందో లేదో నాకు తెలియ‌దు. ఆమె ఏమీ త‌ప్పు చేసిందో స‌రిగ్గా తెలియ‌దు. అది కూడా ఫైన‌ల్‌కు ముందు. ఆమె ఎంతో తీవ్ర‌త‌తో ప్రాక్టీస్ చేసేది. ఆమె త‌న 100 శాతం ఎఫ‌ర్ట్ పెట్టింది.’ అని సైనా నెహ్వాల్ అంది.

‘సాధారణంగా ఈ స్థాయిలో ఇలాంటి తప్పులు జ‌ర‌గ‌వు. ఇది ఎలా జరిగిందనేది ప్రశ్నార్థకం. ఇది ఆమెకు తొలి ఒలింపిక్స్ కాదు. మూడో సారి ఒలింపిక్స్ బ‌రిలో ఉంది. ఓ అథ్లెట్‌గా ఆమెకు నియ‌మాల‌పై ఖ‌చ్చితంగా అవ‌గాహ‌న ఉంటుంది. పొరపాటు ఎక్క‌డ జ‌రిగింది అనే విష‌యం ఖ‌చ్చితంగా నాకు తెలియ‌దు. ఇలాంటి పెద్ద ఈవెంట్‌లో బ‌రువు పెరిగిన కార‌ణంతో అన‌ర్హ‌త వేటు ప‌డ‌డం గురించి గ‌తంలో నేను ఎప్పుడు విన‌లేదు. వినేష్ వైపు కూడా ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది. ఆమె కూడా దీనికి బాధ్య‌త తీసుకోవాలి. ఇంత పెద్ద మ్యాచ్‌కు ముందు ఇలాంటి పొరపాటు సరికాదు.’ అని సైనా చెప్పుకొచ్చింది.

వినేశ్ ఫోగ‌ట్ అనర్హతపై ఆనంద్ మ‌హీంద్రా సంచ‌ల‌న పోస్ట్..

వారే స‌మాధానం చెప్పాలి..

వినేశ్ ఫోగ‌ట్ ఆసియా క్రీడ‌ల్లో, కామన్వెల్త్ గేమ్స్ లో ఛాంపియ‌న్‌గా నిలిచింది. వినేష్ నుంచి కూడా ఎక్కడో పొరపాటు జరిగి ఉండాలి. ఎందుకంటే ఇంత పెద్ద మ్యాచ్‌కి ముందు ఎవ‌రైనా స‌రే బరువు అనుమతించదగిన పరిమితుల్లో ఉండాలని అప్రమత్తంగా ఉంటాడు. అలాంటిది పొరపాటు ఎలా జరిగింది? దీనికి ఆమె లేదా ఆమె కోచ్ మాత్రమే సమాధానం చెప్పగలరు. కానీ మేము ఖచ్చితంగా పతకాన్ని కోల్పోయామని నిరుత్సాహపడుతున్నాను” అని సైనా అన్నారు.