Neeraj Chopra – Nadeem : భారత్-పాక్‌ స్టార్లు.. మైదానంలో ప్ర‌త్య‌ర్థులు.. బయట దోస్తులు..

పారిస్ ఒలింపిక్స్‌లో పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ న‌దీమ్ చ‌రిత్ర సృష్టించాడు.

Neeraj Chopra – Nadeem : భారత్-పాక్‌ స్టార్లు.. మైదానంలో ప్ర‌త్య‌ర్థులు.. బయట దోస్తులు..

Neeraj Chopra and Arshad nadeem friends in outside

Neeraj Chopra and Arshad nadeem : పారిస్ ఒలింపిక్స్‌లో పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ న‌దీమ్ చ‌రిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్ చ‌రిత్ర‌లో జావెలిన్ త్రోలో అత్య‌ధిక దూరం విసిరి స్వ‌ర్ణ ప‌త‌కం అందుకున్నాడు. 92.97 మీట‌ర్ల దూరం అత‌డు బ‌ల్లెం విసిరాడు. భార‌త స్టార్ అథ్లెట్ నీర‌జ్ చోప్రా 89.45 మీట‌ర్ల దూరం విసిరి ర‌జ‌త ప‌త‌కాన్ని సొంతం చేసుకున్నాడు. ఫైన‌ల్ అనంత‌రం న‌దీమ్ మాట్లాడుతూ.. క్రికెట్‌తో పాటు ఇత‌ర క్రీడ‌ల్లో భార‌త్, పాకిస్తాన్ మ‌ధ్య పోరంటే ర‌స‌వ‌త్త‌రంగానే ఉంటుంద‌ని చెప్పాడు. ఇక నీర‌జ్‌తో పోటీ ప‌డ‌డం ఎప్పుడూ బాగుంటుంద‌ని, దీన్ని తాను ఎంత‌గానో ఆస్వాదిస్తాన‌న్నాడు.

“క్రికెట్ మ్యాచ్‌లే కాదు ఇతర క్రీడల్లో భార‌త్‌, పాకిస్తాన్‌ల మ‌ధ్య పోటీ ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. మైదానంలోనే మేం ప్ర‌త్య‌ర్థులం బ‌య‌ట మంచి స్నేహితులం అని చెప్పాడు. నీర‌జ్‌తో ఇలాంటి పెద్ద వేదిక‌ల‌పై పోటీ ప‌డ‌డం ఎంతో బాగుంటుంది.రెండు దేశాల్లో ఇలాంటి పోటీ యువ‌త‌కు స్ఫూర్తి అని చెప్పాడు. క్రీడాకారులుగా ఇండో-పాక్ దేశాల మ‌ధ్య స్నేహ‌భావం కొన‌సాగేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉంటాం అని న‌దీమ్ అన్నాడు.

మైదానంలో శ‌త్రువులు.. బ‌య‌ట మిత్రులు..

1988 సియోల్ ఒలింపిక్స్‌లో బాక్స‌ర్ హుస్సేన్ షా మిడిల్ వెయిట్‌లో కాంస్యం ప‌త‌కం గెలుపొందిన త‌రువాత ఒలింపిక్స్‌తో వ్య‌క్తిగ‌త ప‌త‌కం చేసుకున్న మొద‌టి పాక్ అథ్లెట్‌గా న‌దీమ్ నిలిచాడు. మైదానంలో పోటీప‌డే న‌దీమ్‌, నీర‌జ్ చోప్రాలు బ‌య‌ట మంచి స్నేహితులు. ఒలింపిక్స్ ఆరంభానికి కొన్ని రోజుల ముందు జావెలిన్ కొనుగోలు చేసేందుకు న‌దీమ్ వ‌ద్ద డ‌బ్బులు లేని స‌మ‌యంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా పాక్ ప్ర‌భుత్వం అత‌డికి సాయం చేయాల్సిందిగా నీర‌జ్ చోప్రా విజ్ఞ‌ప్తి చేశాడు.

Vinesh Phogat : వినేశ్ ఫోగ‌ట్‌కు ర‌జ‌తం వ‌చ్చేనా..? సీఏఎస్ తీర్పు ఎలా ఉండ‌బోతుంది..?

ఇక వీరిద్ద‌రు 2016లో తొలిసారి క‌లిశారు. 19 ఏళ్ల అర్షద్ నదీమ్ లాహోర్ నుంచి బస్సులో అమృత్‌సర్‌కు వచ్చాడు. అతను దక్షిణాసియా క్రీడలు నిర్వహిస్తున్న గౌహతికి వెళ్లాల్సి ఉంది. ఇక్కడే నీరజ్‌, నదీమ్ మొదటిసారి కలుసుకున్నారు. ఈ పోటీలో నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో 82.23 మీటర్ల దూరంతో బంగారు పతకం సాధించాడు. కాగా, నదీమ్ జావెలిన్ 78.33 మీటర్లు విసిరి కాంస్య పతకాన్ని సాధించాడు.

ఆ తరువాత.. వియత్నాంలో జరిగిన ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో నీర‌జ్‌, న‌దీమ్‌లు పోటీ పడ్డారు. ఇక్కడ నీరజ్ 77.60 మీటర్ల దూరం జావెలిన్ విసిరి రజత పతకాన్ని గెలుచుకోగా.. 73.40 మీటర్ల దూరం మాత్ర‌మే విసిరిన‌ నదీమ్ కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రపంచ అండర్-20 ఛాంపియన్‌షిప్‌లో కూడా నీరజ్ జావెలిన్‌ను 86.48 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం సాధించాడు. కాగా.. నదీమ్ 67.17 మీటర్ల దూరం సాధించి 15వ స్థానంలో నిలిచాడు.

టోక్యోలో ఫైన‌ల్‌లో అలా..

ఇక టోక్యో ఒలింప‌క్స్‌లోనూ ఈ ఇద్ద‌రి పోరు ఆస‌క్తి రేపింది. 87.58 మీ దూరం విస‌రి స్వ‌ర్ణంతో నీర‌జ్ చ‌రిత్ర సృష్టించ‌గా 86.42 మీట‌ర్ల దూరం విసిరిన‌ న‌దీమ్ ఐదో స్థానంతో స‌రిపెట్టుకున్నాడు. అయితే.. ఫైన‌ల్ ప్రారంభానికి ముందు ఒక్క‌సారిగా నీర‌జ్ జావెలిన్ క‌నిపించ‌కుండా పోయింది. అత‌డు దాని కోసం వెత‌క‌గా అది న‌దీమ్ అర్ష‌ద్ చేతుల్లో క‌నిపించింది. జావెలిన్ ప‌ట్టుకుని న‌దీమ్ అటు ఇటు తిరుగుతున్నాడని, అత‌డి వ‌ద్ద‌కు వెళ్లిన నీర‌జ్ బాయ్ ఆ జావెలిన్ ఇవ్వు. అది నాది ఫైన‌ల్‌లో దానినే విస‌రాలి అని అడిగాడు. వెంట‌నే అర్ష‌ద్ దాన్ని తిరిగి ఇచ్చేసిన‌ట్లుగా నీర‌జ్ గ‌తంలో చెప్పాడు. వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న అనుబంధానికి ఈ ఘ‌ట‌న‌నే నిద‌ర్శ‌నం.

IND vs AUS : ఆసీస్ టూర్‌లో రెండు రోజుల డే/నైట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడ‌నున్న భార‌త్‌.. అప్ప‌ట్లో అలా జ‌రిగినందుకేనా..?

నీర‌జ్ దూరం, స్వ‌ర్ణం గెలిచిన న‌దీమ్‌..
2022 కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణాన్ని న‌దీమ్ సొంతం చేసుకున్నాడు. అప్పుడు ఏకంగా 90.18 మీట‌ర్ల దూరం బ‌ల్లెంను విసిర రికార్డు న‌మోదు చేశాడు. ఈ టోర్నీలో గాయం కార‌ణంగా నీర‌జ్ దూరం అయ్యాడు. ఇక 2023లో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో నీర‌జ్ స్వ‌ర్ణం గెల‌వ‌గా, న‌దీప్ ర‌జ‌తంతో స‌రిపెట్టుకున్నాడు. ఇక పారిస్ ఒలింపిక్స్‌లో రికార్డు సృష్టిస్తూ న‌దీమ్ స్వ‌ర్ణ ప‌త‌కాన్ని అందుకోవ‌గా నీర‌జ్ చోప్రా ర‌జ‌తం కైవ‌సం చేసుకున్నాడు.