Neeraj Chopra : పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రాకు రజతం.. ఒలింపిక్స్ రికార్డు బద్దలు కొట్టిన పాక్ అథ్లెట్
ఎన్నో అంచనాలతో పారిస్ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టుకున్నాడు.
Neeraj Chopra wins Silver Medal : ఎన్నో అంచనాలతో పారిస్ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టుకున్నాడు. వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటుతో నిరాశలో మునిగిపోయిన భారత అభిమానులకు కాస్త ఊరట నిచ్చాడు. వాస్తవానికి అతడు స్వర్ణం పతకం గెలుస్తాడని భావించినప్పటికి అలా జరగలేదు. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ స్వర్ణం స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. కాగా.. పారిస్ ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య ఐదుకు చేరింది.
నాలుగేళ్ల క్రితం ఏ మాత్రం అంచనాలు లేని సమయంలో ఏదో ఒక పతకం రావడమే గొప్ప అనుకున్న స్థితిలో ఏకంగా స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు నీరజ్ చోప్రా. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్ భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఈ బల్లెం వీరుడు క్వాలిఫికేషన్‌లో 89.34 మీటర్ల దూరం విసిరి అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకున్నాడు.
Antim Panghal : భారత రెజ్లర్ పై మూడేళ్ల నిషేదం..! స్పందించిన అంతిమ్ పంగల్..
ఫైనల్‌లోనూ అంతకంటే కాస్త మెరుగైన ప్రదర్శనే చేశాడు. 89.45 మీటర్ల దూరం విసిరాడు. అయినప్పటికి ఈ దూరం స్వర్ణ పతకం గెలుచుకునేందుకు సరిపోలేదు. నీరజ్ కెరీర్‌లోనే ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం.
పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ ఒలింపిక్స్ రికార్డు బద్దలు కొట్టాడు. 92.97మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని ఎగురవేసుకుని పోయాడు. ఇక వీరిద్దరు కూడా తొలి ప్రయత్నంలో పౌల్ చేయగా రెండో ప్రయత్నంలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన చేయడం గమనార్హం. మైదానం బయట వీరిద్దరు మంచి మిత్రులు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
??? ??????????? ??????! A terrific performance from Neeraj Chopra to win India’s first Silver medal at #Paris2024 .
? Many congratulations to him on this incredible achievement!
? ?????? @sportwalkmedia ??? ????????? ????????… pic.twitter.com/uKjeiKGnFP
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 8, 2024