Antim Panghal : భారత రెజ్లర్ పై మూడేళ్ల నిషేదం..! స్పందించిన అంతిమ్ పంగల్..
భారత యువ రెజ్లర్ అంతిమ్ పంగల్ పై భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) మూడేళ్ల నిషేదం విధించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
Wrestler Antim Panghal : భారత యువ రెజ్లర్ అంతిమ్ పంగల్ పై భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) మూడేళ్ల నిషేదం విధించినట్లుగా వార్తలు వస్తున్నాయి. పారిస్ ఒలింపిక్స్‌లో తన అక్రిడిటేషన్‌తో ఆమె తన సోదరిని ఒలింపిక్ విలేజీలోకి పంపించడం తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో క్రమశిక్షణ రాహిత్యం కింద ఆమెపై ఐఓఏ మూడేళ్ల నిషేదం విధించినట్లు సదరు వార్తల సారాంశం. అయితే.. దీనిపై ఐఓఏ స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదంది. అంతిమ్ పంగల్ పై ఎలాంటి నిషేదం విధించలేదని తెలిపింది.
ఇక ఒలింపిక్ విలేజ్‌లోకి తన సోదరిని పంపించడం పై తొలిసారి అంతిమ్ పంగాల్ స్పందించింది. నిన్న తనకేదీ కలిసి రాలేదంది. క్వార్టర్స్‌లో బౌట్‌లో ఓడిపోయిన తరువాత నుంచి తాను, తన సోదరి అరెస్టు అయినట్లుగా వార్తలు వచ్చాయంది. అయితే.. అలాంటిది ఏదీ జరగలేదని, ఓడిపోయిన తరువాత తనకు జ్వరం వచ్చినట్లుగా చెప్పింది. ఓపిక లేకపోవడంతో కోచ్ అనుమతి తీసుకుని హోటల్‌కి వెళ్లిపోయినట్లుగా చెప్పుకొచ్చింది.
Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో మరో పతకం.. కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు
ఇక ఒలింపిక్ విలేజ్‌లో ఉన్న తన వస్తువుల్లో కొన్ని అవసరం కావడంతో.. తాను నిద్రపోయిన తరువాత తన సోదరి తన అక్రిడిటేషన్ కార్డు తీసుకుని ఒలింపిక్ విలేజ్ వద్దకు వెళ్లినట్లుగా తెలిపింది. ‘వస్తువులను తీసుకువెళ్లొచ్చా అని నా సోదరి అక్కడి అధికారులను అడిగింది. అయితే.. వాళ్లు ఆమె వద్దనున్న అక్రిడిటేషన్ కార్డును తీసుకుని ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. వెరిఫికేషన్ కోసం మాత్రమే ఆమె స్టేషన్‌కు వెళ్లింది. మమ్మల్నీ అరెస్ట్ చేయలేదు. కొంచెం సేపటి తరువాత కార్డు ఇచ్చి ఆమెను పంపించారు.’ అని అంతిమ్ చెప్పింది.
అంతిమ్ తన అక్రిడిటేషన్‌ను దుర్వినియోగం చేసినట్లు భావించిన ఒలింపిక్ నిర్వాహకులు దానిని రద్దు చేశారు. ఈ విషయంలో అంతిమ్‌కు తమ పూర్తి సహకారం అందిస్తున్నామని ఐఓఏ తెలిపింది.
Vinesh Phogat : అంతా అయిపోలేదు.. వినేశ్ ఫోగట్‌కు పతకం పై ఆశలు మిగిలే ఉన్నాయ్..!