Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో మరో పతకం.. కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు
పారిస్ ఒలింపిక్స్‌లో భారత ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య నాలుగుకి చేరింది. ఈ నాలుగు కూడా కాంస్య పతకాలే కావడం గమనార్హం.
కాంస్య పతకం కోసం గురువారం స్పెయిన్‌తో భారత్ తలపడింది. 2-1 గోల్స్ తేడాతో టీమ్ఇండియా గెలుపొందింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 30వ నిమిషంలో, 33వ నిమిషంలో రెండు గోల్స్ చేసి భారత జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
Vinesh Phogat : అంతా అయిపోలేదు.. వినేశ్ ఫోగట్‌కు పతకం పై ఆశలు మిగిలే ఉన్నాయ్..!
మ్యాచ్ తొలి క్వార్టర్స్‌లో ఇరు జట్లు గోల్స్ చేయడంలో విఫలం అయ్యాయి. అయితే.. రెండో క్వార్టర్ ఆరంభంలో స్పెయిన్ ఆటగాడు (18వ నిమిషం)మార్క్ మిరల్లెస్ పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలిచాడు. దీంతో స్పెయిన్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. 29వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ గోల్ గా మలిచేందుకు ప్రయత్నించగా స్పెయిన్ గోల్ కీలర్ అడ్డుకున్నాడు.
ఆ వెంటనే మరో పెనాల్టీ కార్నర్ లభించగా.. ఈ సారి దాన్ని హర్మన్‌ప్రీత్ గోల్‌గా మలిచాడు. దీంతో స్కోరు 1-1తో సమ మైంది. మూడో క్వార్టర్‌లో మరో గోల్ చేసిన హర్మన్ భారత ఆధిక్యాన్ని 2-1కి పెంచాడు. ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వచ్చిన భారత్ విజేతగా నిలిచింది.
కాగా.. ఒలింపిక్స్‌లో భారత్ వరుసగా రెండు కాంస్యలను అందుకుంది. 2020 టోక్యో ఒలిపిక్స్‌లోనూ భారత్ కాంస్యం గెలిచిన సంగతివ తెలిసిందే.
???? ?????? ????? ?? ??? ?????!
Consecutive bronze medals for team India, we defeat Spain in the Bronze Medal match.
Full-Time:
India ?? 2️⃣ – 1️⃣ ?? Spain#Hockey #HockeyIndia #IndiaKaGame #WinItForSreejesh #Paris2024 #INDvsESP@CMO_Odisha… pic.twitter.com/WlpzrZu4jh— Hockey India (@TheHockeyIndia) August 8, 2024