TG Vishwaprasad : నేను రాజకీయాల్లోకి రాను.. పవన్ సన్నిహితుడు, నిర్మాత వ్యాఖ్యలు.. ఎందుకంటే..

పవన్ కళ్యాణ్ కి విశ్వప్రసాద్ చాలా క్లోజ్ అవ్వడం, జనసేనకు బాగా సపోర్ట్ చేయడంతో ఏదైనా నామినేటెడ్ పదవి, రాజ్యసభ లాంటివి ఇస్తారని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.

TG Vishwaprasad : నేను రాజకీయాల్లోకి రాను.. పవన్ సన్నిహితుడు, నిర్మాత వ్యాఖ్యలు.. ఎందుకంటే..

Pawan Kalyan Close Person Producer TG Viswaprasad Comments on Politics

TG Vishwaprasad – Pawan Kalyan : టాలీవుడ్ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్ కి బాగా క్లోజ్ అని తెలిసిందే. ఎన్నికల ముందు నుంచి కూడా జనసేనకు వెనకుండి విశ్వప్రసాద్ బాగా సపోర్ట్ చేసారు. ఏపీలో కూటమి విజయం తర్వాత టాలీవుడ్ లో గ్రాండ్ సెలెబ్రేషన్స్ కూడా నిర్వహించారు. జనసేనకు ఆర్థికంగా కూడా విశ్వప్రసాద్ సహకరించారని సమాచారం.

గతంలో ఈయన నిర్మాణంలో పవన్ కళ్యాణ్ బ్రో అనే సినిమా తీశారు. అయితే పవన్ కళ్యాణ్ కి విశ్వప్రసాద్ చాలా క్లోజ్ అవ్వడం, జనసేనకు బాగా సపోర్ట్ చేయడంతో ఏదైనా నామినేటెడ్ పదవి, రాజ్యసభ లాంటివి ఇస్తారని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలని తాజాగా నిర్మాత విశ్వప్రసాద్ కొట్టిపారేశారు.

Also Read : Prabhas – Hanu Raghavapudi : ప్రభాస్ హను రాఘవపూడి సినిమా అప్డేట్.. టైటిల్ ఇదే.. షూటింగ్ అప్పట్నుంచే..!

విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ద్వారా రాజ్యసభ, లేదా ఏదైనా పదవి వస్తుందని వార్తలు వస్తున్నాయి అని మీడియా అడగ్గా నిర్మాత విశ్వప్రసాద్ సమాధానమునిసిస్తు.. నేను పాలిటిక్స్ లోకి రాను. అసలు నాకు ఇండియా పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశం లేదు. నేను అమెరికా సిటిజన్ ని. నాకు అమెరికా సిటిజెన్ షిప్ ఉంది. దాని ప్రకారం ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చే అవకాశం లేదు అని తెలిపారు. దీంతో జనసేనకు సపోర్ట్ గా ఉంటారు కానీ ఎలాంటి పదవులు ఆశించరని క్లారిటీ ఇచ్చారు.