Gold Price Today : బంగారం కొనుగోలుదారులకు బిగ్ షాక్.. తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాముల గోల్డ్ ధర ఎంతో తెలుసా?

దేశ వ్యాప్తంగా శనివారం వెండి ధర స్వల్పంగా పెరిగింది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం..

Gold Price Today : బంగారం కొనుగోలుదారులకు బిగ్ షాక్.. తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాముల గోల్డ్ ధర ఎంతో తెలుసా?

Gold and Silver Price Today : బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 820 పెరగగా.. శనివారం రూ. 220 పెరిగింది. మరోవైపు వెండిధర సైతం భారీగా పెరుగుతుంది. శుక్రవారం కిలో వెండిపై రూ. 1500 పెరగ్గా.. శనివారం కిలో వెండిపై రూ. 100 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలాఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం.

 

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధర భారీగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,450 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.70,310.
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.64,600 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 70,460.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.64,450 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 70,310.
    చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,450 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70,310 వద్ద కొనసాగుతుంది.

 

  • వెండి ధర ఇలా ..
    దేశ వ్యాప్తంగా శనివారం వెండి ధర స్వల్పంగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
    తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 88,100.
    దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
    చెన్నైలో కిలో వెండి ధర రూ.88,100.
    కోల్ కతా, ఢిల్లీ, ముంబయిలో వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. 4,900 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 83,100 వద్ద కొనసాగుతుంది.
    బెంగళూరులో వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. 7,350 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 80,650 వద్ద కొనసాగుతుంది.

 

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.