విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. కూటమి అభ్యర్థి ఖరారు?

2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ ని ఆశించారు. కానీ, పొత్తులో భాగంగా అనకాపల్లి పార్లమెంట్ టికెట్ ను బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది.

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. కూటమి అభ్యర్థి ఖరారు?

Visakha MLC By Election 2024 : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ సిద్ధమైంది. అయితే కూటమి అభ్యర్థి ఎంపికలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కూటమి తరుపున పోటీకి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో అనూహ్య పరిణామాల తర్వాత కూటమి అభ్యర్థి ఎంపికను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బైరా దిలీప్ చక్రవర్తి పేరును కూటమి ఖరారు చేసినట్లు సమాచారం. చంద్రబాబు అనుమతితో దీనిపై అధికారికంగా ప్రకటించనున్నారు.

2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ ని బైరా దిలీప్ చక్రవర్తి ఆశించారు. కానీ, పొత్తులో భాగంగా అనకాపల్లి పార్లమెంట్ టికెట్ ను బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది. దీంతో బైరా దిలీప్ చక్రవర్తికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని సమాచారం. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 30న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.