Viral Video : కదిలే ట్రక్కు వెనుక స్కేటింగ్ చేస్తూ యువకుల డేంజరస్ స్టంట్స్.. వీడియో వైరల్..!

Viral Video : బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు కదులుతున్న ట్రక్కు వెనుక స్కేటింగ్ చేస్తూ ప్రమాదకరమైన స్టంట్‌ చేస్తున్న షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video : కదిలే ట్రక్కు వెనుక స్కేటింగ్ చేస్తూ యువకుల డేంజరస్ స్టంట్స్.. వీడియో వైరల్..!

Viral Video Of 2 Boys Skating Behind Moving Truck In Bangladesh Sparks Outrage

Viral Video : సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చాలా మంది యువకులు ఎంతకైనా తెగిస్తున్నారు. ప్రమాదకర విన్యాసాలను చేస్తూ ప్రాణాల మీదుకు తెచ్చుకుంటున్నారు. అదృష్టం బాగుంటే పర్వాలేదు కానీ, కొంచెం అటు ఇటు అయినా ప్రాణాలు గాల్లో కలిసి పోవాల్సిందే.

Read Also : Realme C63 5G Launch : భారీ బ్యాటరీతో రియల్‌మి C63 5జీ ఫోన్ ఇదిగో.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు కదులుతున్న ట్రక్కు వెనుక స్కేటింగ్ చేస్తూ ప్రమాదకరమైన స్టంట్‌ చేస్తున్న షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢాకాలోని బిజోయ్ సరానీ మెట్రో స్టేషన్ సమీపంలో రద్దీగా ఉండే రహదారిపై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ కనిపించారు. ప్రమాదమని తెలిసి కూడా ఇద్దరు యువకులు అధిక వేగంతో ట్రక్కును ఓవర్ టేక్ చేస్తూ ముందుకు వెళ్లేందుకు ట్రక్కు స్లిప్‌స్ట్రీమ్‌ పట్టుకుని ఉండటం వీడియోలో చూడవచ్చు.

వాస్తవానికి జూలై 27న ఈ వీడియోను పోస్ట్ చేయగా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ ఇద్దరి యువకులను తిట్టిపోస్తున్నారు. ప్రాణాల పట్ల లెక్క లేకుండా ఇలాంటి విన్యాసాలు చేయడం పిచ్చితనం అంటూ మండిపడుతున్నారు. ప్రత్యేకించి యువతలో ఇటువంటి విన్యాసాలతో ప్రమాదాలను పూర్తిగా గ్రహించలేరని అంటున్నారు.

మరికొందరు ఈ యువకులను ప్రశంసిస్తున్నారు. అంత వేగంలో కూడా బ్యాలెన్స్ చేస్తూ వెళ్లడాన్ని చూసి ఆశ్చర్యంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఆ అబ్బాయి అద్భుతమైన బ్యాలెన్స్, నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అతని ప్రతిభను మెచ్చుకోవాలి. ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యం. తమతో పాటు ఇతరులను కూడా ప్రమాదంలో పడేస్తున్నారని మరో యూజర్ పోస్టు చేశాడు. ఢాకాలోని అధికారులు వీడియోపై ఇంకా స్పందించలేదు.

Read Also : Vijay Sales Freedom Sale : విజయ్ సేల్స్ మెగా ఫ్రీడమ్ సేల్‌.. ఐఫోన్ 15 ప్లస్, వన్‌ప్లస్ 12పై అదిరే డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!