Bengaluru Cop Life : ప్రాణాలను పణంగా పెట్టి దొంగను పట్టుకున్న పోలీసన్నా.. నీ ధైర్యానికి హ్యాట్సాఫ్.. వీడియో!

Bengaluru Cop Life : 40 కేసుల్లో నిందితుడైన దొంగను బెంగళూరు పోలీసు కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి పట్టుకున్నాడు. వైరల్ అవుతున్న వీడియో..

Bengaluru Cop Life : ప్రాణాలను పణంగా పెట్టి దొంగను పట్టుకున్న పోలీసన్నా.. నీ ధైర్యానికి హ్యాట్సాఫ్.. వీడియో!

Bengaluru cop risks life, jumps in front of scooter to catch thief in daring act

Bengaluru Cop Life : అతడో ఘరానా దొంగ.. పోలీసులకు చిక్కుకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. నగరమంతా ఆ దొంగ కోసం తీవ్రంగా జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఇదే క్రమంలో ఆ దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పోలీసులు అతన్ని పట్టుకునే క్రమంలో తప్పించుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించాడు. ఒక పోలీసు కానిస్టేబుల్ తన ప్రాణాని పణంగా పెట్టి మరి ఆ దొంగను గట్టిగా పట్టుకున్నాడు. ఇటీవలే ఈ సంఘటన సదాశివనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలోని సీసీ కెమెరాకు చిక్కింది.

Read Also : నా జీవితాన్ని నాశనం చేశారు.. ఆ ఆరుగురే నా మరణానికి కారణం అంటూ.. విశాఖలో విషాదం

నగరంలోని హెసరఘట్ట ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల మంజేష్‌గా గుర్తించిన దొంగ.. స్కూటర్‌పై ట్రాఫిక్ సిగ్నల్ దాటేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ దొడ్డలింగయ్య తెలివిగా పనిచేసి నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. కానిస్టేబుల్ సాహసోపేతంగా వేగంగా వెళ్లి దొంగ కాలును వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. నిందితుడు తన స్కూటర్‌తో కానిస్టేబుల్‌ను విడిపించుకునేందుకు వేగంగా మలుపు తిప్పాడు. ఎలాగైనా కానిస్టేబుల్ పట్టును వదలడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వీడియో ఫుటేజీలో కనిపిస్తుంది.

నిందితుడు తప్పించుకోకుండా దొడ్డలింగయ్య గట్టిగా అతన్ని పట్టుకున్నాడు. కానిస్టేబుల్‌ నుంచి దూరంగా పరిగెత్తడానికి దొంగ ప్రయత్నించాడు. కానీ, ఇతర పోలీసు అధికారులు, చుట్టుపక్కలవారు వచ్చి సాయం చేయడంతో దొంగ ప్రయత్నం విఫలమైంది. పోలీసులు, స్థానికులు వచ్చి అతన్ని చుట్టుముట్టడంతో ఎట్టకేలకు దొంగను పట్టుకున్నారు. నెలరోజుల పాటు సాగిన ఆపరేషన్ తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసి ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు.

కొరటగెరెలో నాలుగు, కోలాల, మధుగిరి, హెబ్బూరులో ఒక్కొక్కరితో సహా నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసులకు సంబంధించి దొంగను వెతుకుతున్నారు. దొంగ నేర చరిత్రను పరిశీలిస్తే.. అతడు తుమకూరు, హెబ్బూరు, మధుగిరి, కొరటగెరె పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడు నేరాలలో వాంటెడ్ క్రిమినల్.

తుమకూరు వెలుపల, ముఖ్యంగా బెంగళూరులో అతనిపై మొత్తం 32 కేసులు ఉన్నాయని తుమకూరు పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కెవిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐకి నివేదించింది. బెంగుళూరు పోలీసులు కానిస్టేబుల్ దొడ్డలింగయ్య, ఇతరుల ధైర్యానికి మెచ్చుకున్నారు. కానిస్టేబుల్ దొడ్డలింగయ్యను సత్కరించాలని కూడా డిపార్ట్‌మెంట్ నిర్ణయించినట్లు పీటీఐ నివేదించింది.

Read Also : Viral Video : ‘తౌబా తౌబా’ పాటకు యువతి డ్యాన్స్.. ఓ మైగాడ్.. ఏం కాలేదు.. రీల్స్ కోసం లైఫ్ రిస్క్..!